NTV Telugu Site icon

INDvsAUS 2nd Test: నిలకడగా ఆసీస్ బ్యాటింగ్..టీ బ్రేక్ సమయానికి 199/6

Aus

Aus

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు మంచి శుభారంభమే లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (15), ఉస్మాన్ ఖవాజా (81) మొదటి వికెట్‌కు 50 రన్స్ పార్ట్‌నర్‌షిప్ అందించారు. అనంతరం కాసేపటికే వార్నర్‌ను షమీ ఔట్ చేశాడు. కాగా కాసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన లబుషేన్ (18)తో పాటు స్టీవ్ స్మిత్ (0)లను ఒకే ఓవర్లో పెవిలియన్ పంపిన అశ్విన్.. టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఖవాజా మాత్రం తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత.. రాహుల్ అందుకున్న సూపర్ క్యాచ్‌తో కాసేపటికే ట్రెవిస్ హెడ్ (12) కూడా వెనుదిరగడంతో 108 రన్స్‌కు ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

Also Red: Disney+ Hotstar down: డిస్నీ+ హాట్‌స్టార్ డౌన్.. నెట్టింట ట్రోల్స్ వెల్లువ

అనంతరం, ఖవాజాతో కలిసిన హ్యాండ్స్‌కాంబ్ (36 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. స్పిన్ బౌలింగ్‌లో ఇతడు సూపర్ బ్యాటింగ్ చేశాడు. క్రీజులో లోతుగా ఉంటూ బ్యాక్‌ఫుట్‌తో అదిరిపోయే షాట్స్ ఆడాడు. దీంతో మరో వికెట్ కోసం ఇండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన జడేజా సెంచరీ వైపు దూసుకెళ్తున్న ఖవాజాను ఔట్ చేశాడు. ఫలితంగా ఐదో వికెట్‌కు 75 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. అలెక్స్ కారే (0) విఫలమైనా కమిన్స్‌ (23 బ్యాటింగ్) తో కలిసి హ్యాండ్స్‌కాంబ్ టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 56 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 రన్స్‌ చేసింది.

Also Read: Asia Cup 2023: ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం!