Site icon NTV Telugu

Hamas Hostages 2025: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు

Hamas Hostages 2025

Hamas Hostages 2025

Hamas Hostages 2025: ఈరోజు హమాస్ 20 మంది ఇజ్రాయెల్ బందీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ఇజ్రాయెల్ విడుదల చేసిన జాబితాకు సమానంగా ఉంది. అల్-అక్సా ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా బతికి ఉన్న “జియోనిస్ట్ ఖైదీలను” విడుదల చేయాలని అల్-కస్సామ్ బ్రిగేడ్స్ నిర్ణయించినట్లు హమాస్ పేర్కొంది. హమాస్ నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్‌కు సజీవంగా పంపించే బందీల పేర్లు క్రింది విధంగా ఉన్నాయి. బార్ అబ్రహం కుపెర్ స్టెయిన్, అవితార్ డేవిడ్, యోసెఫ్ హైమ్ ఒహానా, సెగెవ్ కాల్ఫోన్, ఎల్కానా బుహ్బాత్, మాగ్జిమ్ హెర్కిన్, నిమ్రాడ్ కోహెన్, మతన్ త్సాంగవ్కర్, డేవిడ్ కొనియో, ఏతాన్ హోర్న్, మాటన్ ఆంగ్రిస్ట్, ఏతాన్ మోర్, గాలి బర్మన్, జెవ్ బెర్మన్, ఒమ్రి మిరాన్, అలాన్ ఓహెల్, గై గిల్బోవా-దలాల్, రోమ్ బ్రాస్లావ్స్కీ, ఏరియల్ కోన్యో.

READ ALSO: Donald Trump: ట్రంప్‌కు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో స్టాండింగ్ ఒవేషన్.. ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కారం

ఈ ఖైదీల జీవితాలు కన్నీళ్లు తెప్పిస్తాయి..
ఏరియల్ కునియో: పలు నివేదిక ప్రకారం.. అతని వయస్సు 28 ఏళ్లు. ఆయనను అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో హమాస్ బందీగా తీసుకుంది. ఆయన సోదరుడు ఈటన్ మాట్లాడుతూ.. ఏరియల్ తనకు చెప్పిన చివరి మాటలు “నేను ఒక భయానక పరిస్థితులో ఉన్నట్లు అనిపిస్తుంది” అని చెప్పాడని వెల్లడించారు. హమాస్ దాడి సమయంలో బందీగా చేసుకున్న ఏరియల్ భాగస్వామి కూడా జనవరి 2025లో రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో విడుదలయ్యారు.

డేవిడ్ కునియో: ఆయన వయస్సు 35 సంవత్సరాలని సమాచారం. అక్టోబర్ 7న నిర్ ఓజ్ మ్యూజిక్ ఫెస్టివల్‌పై జరిగిన దాడిలో ఏరియల్ అన్నయ్య, ఆయన భార్య షారన్, వారి 3 ఏళ్ల కవల కుమార్తెలు ఎమ్మా, యులిలను హమాస్ బందీలుగా చేసుకున్నారు. నవంబర్ 2023లో వారం రోజుల కాల్పుల విరమణ సమయంలో డేవిడ్ తప్ప మిగతా వారందరినీ విడుదల చేశారు. డేవిడ్ ఇంకా బతికే ఉన్నాడో లేదో ఆయన కుటుంబానికి తెలియదు. కానీ ఫిబ్రవరి 2025లో విడుదలైన ఇతర బందీలు ఆయన బతికే ఉన్నాడని కుటుంబానికి తెలియజేశారు.

గాలి & జివ్ బెర్మన్: వీళ్లు కవల సోదరులు. వీరి వయస్సు 28. ఈ సోదరులను కిబ్బట్జ్ క్ఫార్ అజా నుంచి వారి పొరుగున ఉన్న ఎమిలీ డమారితో పాటు కిడ్నాప్ చేశారు. జివ్‌ను ఎమిలీతో 40 రోజులు నిర్బంధించారు, తరువాత వారిని వేరువేరుగా బంధించారు. ఎమిలీ జనవరి 2025లో విడుదలైంది. విడుదలైన ఇతర బందీలు గెలి, జివ్ బతికే ఉన్నారని పేర్కొన్నారు.

మతన్ ఆంగ్రెస్ట్: వీరి వయస్సు 22 ఏళ్లు. అక్టోబర్ 7 దాడి సమయంలో ఆయన ఇజ్రాయెల్ ఆర్మీ (IDF) ట్యాంక్‌లో మోహరించబడ్డాడు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఒక జనసమూహం ట్యాంక్ నుంచి బయటకు లాగుతున్నట్లు ఒక వీడియోలో చూపించారు. అనంతరం అతన్ని హమాస్ బందీగా తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆస్తమా, కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని విడుదలైన బందీలు వారి కుటుంబానికి తెలిపారు.

మతన్ జాంగౌకర్: ఆయన వయస్సు 25, అతన్ని తన భాగస్వామి ఇలానా గ్రిట్జెవ్‌స్కీతో కలిసి నిర్ ఓజ్ నుంచి కిడ్నాప్ చేశారు. ఇలానా నవంబర్ 2023లో విడుదలైంది. డిసెంబర్ 2024లో హమాస్ ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో మతన్ గాజాలో ఆహారం, నీరు, మందుల కొరత గురించి మాట్లాడారు.

ఈటన్ హార్న్: ఆయన వయస్సు 38 ఏళ్లు (ఇజ్రాయెల్-అర్జెంటీనా పౌరుడు). తన సోదరుడు యైర్‌తో కలిసి నిర్ ఓజ్ నుంచి కిడ్నాప్ చేయబడ్డారు. యైర్ ఫిబ్రవరి 2025లో విడుదలయ్యారు. విడుదలకు ముందు సోదరులు కౌగిలించుకుని ఏడుస్తున్నట్లు చూపించే వీడియోను హమాస్ విడుదల చేసింది. చివరకు తన సోదరుడిలాగే ఈతాన్ కూడా ఇప్పుడు విడుదలవుతున్నారు.

నిమ్రాడ్ కోహెన్: ఆయన వయస్సు 21 ఏళ్లు. అక్టోబర్ 7న జరిగిన ట్యాంక్ దాడిలో నిమ్రోడ్ కిడ్నాప్ చేయబడ్డారు. ఫిబ్రవరి 2025లో విడుదలైన బందీలు ఆయన బతికే ఉన్నాడని, కానీ శారీరకంగా, మానసికంగా చాలా దుర్భంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఒమ్రి మిరాన్: వీరి వయస్సు 48 ఏళ్లు. నహల్ ఓజ్‌లోని తన ఇంటి నుంచి ఆయనను హమాస్ కిడ్నాప్ చేసింది. ఆయనను తన భార్య లిషే సొంత కారులో కిడ్నాప్ చేశారని చెప్పారు. ఏప్రిల్ 2025లో హమాస్ తన పుట్టినరోజును జరుపుకుంటున్న వీడియోను విడుదల చేసింది. ఆయన భార్య లిషే మాట్లాడుతూ.. “ఒమ్రీ ప్రాణాలతో బయటపడుతాని తనకు ఎప్పుడూ నమ్మకం ఉండేదని చెప్పారు.”

నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి వీళ్లను బందీలుగా చేసుకున్నారు..
గై గిల్బోవా-దలాల్: వీళ్ల వయస్సు 24 ఏళ్లు. వీళ్లు ఇద్దరూ కిడ్నాప్‌కు గురైన సమయంలో ఒక ఉత్సవంలో ఉన్నారు. ఒక వీడియోలో అతన్ని, మరొక బందీ అయిన అలోన్ ఓహెల్‌ను గాజా నగరం చుట్టూ ఊరేగిస్తున్నట్లు ఉంది.

అలాన్ ఓహెల్: ఈయన వయస్సు 24 (ఇజ్రాయెల్-జర్మన్-సెర్బియన్ పౌరుడు). నోవా ఫెస్టివల్ నుంచి హమాస్ అతన్ని కిడ్నాప్ చేసింది. ఆగస్టు 2025 నాటి వీడియోలో అతను గైతో కలిసి కనిపించారు. ఆయన హమాస్ చెరలో ఉన్న కారణంగా ఒక కంటి చూపును కోల్పోయినట్లు సమాచారం.

యోసెఫ్-చైమ్ ఒహానా: యోసేఫ్ వయస్సు 25 ఏళ్లు. ఆయన స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ.. హమాస్ దాడిలో గాయపడిన వారికి సహాయం చేస్తున్నప్పుడు.. సంగీత ఉత్సవంలో తను అపహరణకు గురయ్యారని చెప్పారు. మే 2025లో హమాస్ ఆయన మరొక బందీ ఎల్కానా బోహ్బోట్ పక్కన కూర్చున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది.

ఎల్కానా బోహ్బోట్: ఎల్కానా బోహ్బోట్ వయస్సు 36 ఏళ్లు. ఒక ఉత్సవంలో పనిచేశారు. ఫిబ్రవరి 2025లో విడుదలైన బందీలు ఆస్తమా, తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

అవినాటన్ : అవినాటన్ వయస్సు 32 ఏళ్లు. ఆయన తన స్నేహితురాలు నోవా అర్జామణితో కలిసి కిడ్నాప్ చేయబడ్డారు. జూన్ 2024లో ఇజ్రాయెల్ సైన్యం నోవాను రక్షించింది. మార్చి 2025లో అవినాటన్ కుటుంబానికి అతను బతికి ఉన్నాడనే సమాచారం అందింది.

ఈటన్ మోర్: ఈటన్ మోర్ వయస్సు 25 ఏళ్లు. ఆయన ఆ ఉత్సవంలో సెక్యూరిటీ గార్డుగా ఉన్నా. ఫిబ్రవరి 2025లో అతను బతికే ఉన్నాడని అతని కుటుంబానికి తెలిసింది. హమాస్ బందిఖానాలో ఉన్నప్పుడు, ఎటాన్ ఇతర బందీలకు అపారమైన ధైర్యాన్ని అందించాడు.

మాగ్జిమ్ హెర్కిన్: మాగ్జిమ్ హెర్కిన్ 37 ఏళ్ల ఇజ్రాయెల్-రష్యన్ పౌరుడు. ఆయన కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఏప్రిల్ 2025లో ఆయన, బార్ కూపర్‌స్టెయిన్ కలిసి ఉన్న వీడియోలో కనిపించారు. వారు బతికే ఉన్నారని మొదటిసారిగా అప్పుడే వెల్లడించింది.

బార్ కుపెర్స్టీన్ : బార్ కుపెర్స్టీన్ వయస్సు 23 ఏళ్లు. హమాస్ దాడి సమయంలో గాయపడిన వారికి సహాయం చేయడానికి పారిపోవడానికి బదులుగా ఒక సంగీత ఉత్సవంలో ఆగిన తర్వాత ఆయన కిడ్నాప్ అయ్యారు. తరువాత 2025 ఏప్రిల్‌లో మరొక బందీతో వీడియోలో కనిపించిన తర్వాత అతను బతికే ఉన్నాడని తెలిసింది.

సెగెవ్ కల్ఫోన్: సెగెవ్ కల్ఫోన్ వయస్సు 27 ఏళ్లు. హమాస్ దాడి సమయంలో ఆయన తన స్నేహితుడితో కలిసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ హమాస్ అతన్ని బంధించి కిడ్నాప్ చేశారు.

ఎవ్యతార్ డేవిడ్: ఎవ్యతార్ డేవిడ్ వయస్సు 24 ఏళ్లు. ఆయన కూడా ఈ ఉత్సవం నుంచే కిడ్నాప్ చేయబడ్డారు. ఆగస్టు 2025లో హమాస్ వీడియోల్లో ఆయన చాలా బలహీనంగా, పోషకాహార లోపంతో ఉన్నట్లు కనిపించారు.

రోమ్ బ్రాస్లావ్స్కీ: రోమ్ బ్రాస్లావ్స్కీ వయస్సు 21 ఏళ్లు. ఆయన ఆ సంగీత ఉత్సవంలో భద్రతా బృందంలో భాగంగా ఉన్నారు. హమాస్ బంధించిన తర్వాత ఆయన ఆగస్టు 2025లో ఇస్లామిక్ జిహాద్ వీడియోలో కనిపించారు. వీడియోలో గాజాలో ఆకలి, దాహం పరిస్థితిని ఆయన వివరించారు.

READ ALSO: Madagascar Government Dissolved: మడగాస్కర్‌లో తిరుగుబాటు.. ప్రభుత్వాన్ని రద్దు చేసిన అధ్యక్షుడు! ఇప్పుడు ఏం జరగబోతుంది?

Exit mobile version