Hamas: ఇజ్రాయిల్ హమాస్‌ని పూర్తిగా తుడచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గాజా, ఈజిప్టు సరిహద్దుల్లో దక్షిణాన ఉన్న రఫాను ఆక్రమించింది. ఆ ప్రాంతంలోని ప్రజల్ని ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరిలివెళ్లాలని ఆదేశించింది. గాజా సిటీపై దాడులు తర్వాత హమాస్ నేతలు రఫాలో తలదాచుకున్నట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది. అయితే, ఈ దాడులపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఇజ్రాయిల్ వినడం లేదు. ఇటీవల ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో సంధికి హమాస్ ఒప్పుకున్నా, ఇజ్రాయిల్ రఫాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న హమాస్ కార్యకర్తల్ని తుదుముట్టించేందుకు భూతల దాడులు చేస్తోంది.
Read Also: TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..
అయితే, అక్టోబర్ 7నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా హమాస్ నాయకుడు యహ్యా సన్వార్ అని ఇజ్రాయిల్ భావిస్తోంది. అప్పటి నుంచి అతని కోసం వేట కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే హమాస్ రాజకీయ నాయకుడు, కీలక వ్యక్తిగా ఉన్న యహ్యా సిన్వార్ రఫాలో లేదని, గాజా దక్షిణ నగరం అయిన ఖాన్ యూనిస్‌లో సొరంగాల్లో సురక్షితంగా ఉన్టన్లు ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. అయితే, సిన్వార్ ఇంకా గాజాలోనే ఉన్నాడని ఇజ్రాయిల్‌కి చెందిన మరో అధికారి వెల్లడించారు.
మార్చి నెలలో యాహ్యా సిన్వార్ తన దగ్గరి బంధువులను రఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్టులోని సురక్షిత ప్రాంతాలకు తరలించాడని, ఇతర హమాస్ నేతలు కూడా వారి బంధువులు, కుటుంబ సభ్యుల్ని గాజా నుంచి ఈజిప్టుకి తరలించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7 నాడు దక్షిణ ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి పాల్పడింది. 1200 మందిని చంపేయడమే కాకుండా, 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా యహ్యా సిన్వార్ ఉన్నట్లు ఇజ్రాయిల్ అనుమానిస్తోంది. అప్పటి నుంచి అతడి జాడ కోసం వెతుకుతూనే ఉంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇతర సీనియర్ కమాండర్లు, హమాస్ మిలిటరీ వింగ్ డిప్యూటీ కమాండర్ మార్వాన్ ఇస్సాను చంపేసింది. అయితే సిన్వార్, అతని డిప్యూటీ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెఫ్ జాడ తెలియలేదు.
