NTV Telugu Site icon

Workers Strike : అట్టుడుకుతున్న బ్రిటన్.. వేతనాల కోసం రోడ్డెక్కిన లక్షలాది మంది

Britan Strike

Britan Strike

Workers Strike : పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. తమ వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్‌ చేస్తూ పలు రంగాలకు చెందిన కార్మికులు బ్రిటన్ లో రోడ్డుపైకి వచ్చారు. ఈ దశాబ్ద కాలంలోనే అతి పెద్ద సమ్మెతో బ్రిటన్‌ ప్రస్తుతం అట్టుడుకుతున్నది. రిషి సునాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది రాజధాని లండన్ వీధుల్లోకి వచ్చి ప్రదర్శన జరిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు, సివిల్‌ సర్వెంట్లు, రైలు డ్రైవర్లు ఉన్నారు. ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్ల జీతాలు పెంచితే.. అది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతున్నది.

Read Also: Marriage Cancel : కాసేపట్లో పెళ్లి.. కట్ చేస్తే సీనులోకి పోలీసులు.. ఈ పెళ్లి ఆపండి

దాదాపు 5లక్షల మందికి పైగా కార్మికులు బ్రిటన్‌ వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. విద్య, రవాణా, పౌరసేవలు, తదితర రంగాల కార్మికులు విధులకు వాకౌట్ తెలిపారు. దీంతో బ్రిటన్‌ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. పాఠశాలల మూతపడ్డాయి. రైలు సర్వీసులు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. 2011 నవంబర్‌ 30న జరిగిన పెన్షనర్ల సమ్మె తర్వాత ఇంత పెద్దఎత్తున సమ్మె జరగడం ఇదే మొదటిసారి. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇలా సమ్మెకు దిగడం గందరగోళానికి దారి తీస్తుందని ఉద్యోగుల ప్రదర్శనకు ముందు ప్రధాని కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా నిరసనకు దిగారు. ఇలాఉండగా, తన చేతిలో ఏం మ్యాజిక్‌ లేదని, ఇదెప్పటికీ జరిగేది కాదని రిషి సునాక్‌ రెండు రోజుల క్రితమే చెప్పుకొచ్చారు.

Read Also:Bandi Sanjay: సచివాలయంలో అగ్ని ప్రమాదం.. క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే..