ఈరోజుల్లో వాతావరణం కాలుష్యాల మయం అయ్యింది.. ఒకవైపు పెరుగుతున్న కాలుష్యం, మరోవైపు మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్యలు కూడా వస్తుంటాయి.. జుట్టు సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పెరుగుదల ఆగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. కెమికల్ ప్రోడక్ట్స్ తో కాకుండా హెర్బల్ ఆయిల్స్ తో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చునని నిపుణులు అంటున్నారు… ఆ హెర్బల్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం 3 తమలపాకులను, గుప్పెడు కరివేపాకును, పావు కేజీ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా తమలపాకును సన్నగా ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు, నూనె వేసి వేడి చేయాలి. ఈ నూనెను మధ్యస్థ మంటపై ఆకులు నల్లగా అయ్యే వరకు వేడి చేసి చల్లార్చి వడకట్టాలి.. ఇలా తయారు చేసుకున్న నూనెను గాలి చొరబడని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి..
ఈ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. తరువాత నూనెను కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. తరువాత దీనిని గంట నుండి రెండు గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో లేదా హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.. ఇలా చేసుకున్న నూనెను రోజూ వాడటం వల్ల జుట్టు బాగా పెరుగుతూనే ఉంటుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి… జుట్టు పెరగడంతో పాటు తల నొప్పి కూడా తగ్గుతుంది.. పేల సమస్య కూడా తగ్గిపోతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.