NTV Telugu Site icon

Pak Terrorist: ముంబై దాడి కుట్రదారు, లష్కరే కీలక ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మృతి

Hafiz Abdul Salam Bhuttavi

Hafiz Abdul Salam Bhuttavi

Pak Terrorist: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ బుట్టవీ చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ధ్రువీకరించింది. భుట్టవి గత ఏడాది మేలో పంజాబ్ ప్రావిన్స్ లో ప్రభుత్వ కస్టడీలో ఉండగా.. గుండెపోటుతో మరణించాడు. ఇతను లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్‌కి డిప్యూటీగా ఉన్నాడు.

యూఎన్ఎస్‌సీ ప్రకారం.. భుట్టవి 29 మే 2023న పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో గుండెపోటుతో మరణించాడు. పాక్ ప్రభుత్వం హఫీస్ సయీద్‌ని రెండు సార్లు నిర్భంధించినప్పుడు లష్కరేతోయిబా/ జామాత్ ఉద్ దావాకు తాత్కాలిక చీఫ్‌గా పనిచేశాడు. ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు భుట్టవి శిక్షణ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Sensex: ఆల్-టైమ్ హైకి సెన్సెక్స్.. 200 పాయింట్లకు చేరిన నిఫ్టీ

ముంబై దాడుల అనంతరం 2008లో హఫీస్ సయీద్‌ని అరెస్ట్ చేశారు. అంతకు ముందు 2002లో కూడా అక్కడి ప్రభుత్వం నిర్భందంలోకి తీసుకుని తర్వాత విడుదల చేసింది. ఈ రెండు సందర్భాల్లో లష్కర్ ఉగ్ర సంస్థకు భుట్టవీ కీలకంగా వ్యవహరించాడు. 2002లో పాక్ నగరం లాహోర్‌లో లష్కర్ ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో ఇతను కీలకంగా ఉన్నాడు. N భద్రతా మండలి 2012లో భుట్టవీని టెర్రరిస్టుగా గుర్తించింది. కొన్నాళ్ల తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసి, ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ రహ్మాన్ మక్కీతో పాటు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై ఆగస్టు 2020లో అతడికి శిక్ష విధించింది. అతనికి పాక్ 16.5 ఏళ్లు శిక్ష విధించింది.