Site icon NTV Telugu

H-1B Visa: అమెరికా గుడ్‌న్యూస్‌.. హెచ్- 1బీ వీసాల పునరుద్ధరణ

H1b Visa

H1b Visa

అమెరికాలో పని చేస్తున్న విదేశీ టెక్‌ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారు హెచ్‌-1బీ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పింది. అమెరికాలోనే వాటిని రెన్యువల్‌ చేసుకోవచ్చు అని వెల్లడించింది. ఇందుకు వీలు కల్పించే పైలట్‌ ప్రోగ్రామ్‌కు అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌ హౌస్‌’ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నియంత్రణ సంస్థ ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ ఎఫైర్స్‌ ( ఓఐఆర్‌ఏ ) ఈ నెల 15న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also: Rashmika Mandanna : రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్.. ఆ ఒక్కరి కోసం వేట..

ఇక, మూడు నెలల పాటు అందుబాటులో ఉండే ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20 వేల మంది విదేశీయులకు హెచ్‌- 1బీ వీసాలను రెన్యువల్‌ చేయనున్నారు. దీంతో అమెరికాలో పని చేస్తున్న ఎంతో మంది భారత టెక్‌ నిఫుణులకు లబ్ధి పొందనున్నారు. అమెరికాలో పని చేసే విదేశీ ఉద్యోగులకు హెచ్‌- 1బీ వీసా తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు ఈ వీసాలు పొందినవారు వాటిని పునరుద్దరణ చేసుకునేందుకు స్వదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు పైలట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికాలోనే హెచ్‌ -1బీ వీసాల రెన్యువల్‌కు వీలు కల్పించడంతో విదేశీయులు తమ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

Exit mobile version