NTV Telugu Site icon

GVL Narasimha Rao : గాంధీని ఆదర్శంగా తీసుకొని మోదీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

నేడు గాంధీజయంతిని పురస్కరించుకొని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడుతూ..మహాత్మాగాంధీకి అత్యంత ఇష్టమైంది ఖాదీ అని ఆయన వెల్లడించారు. గాంధీని ఆదర్శంగా తీసుకొని మోదీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, గాంధీ పేరును ఒక కుటుంబం రాజకీయ లబ్ది కోసం వాడుకొంటుందని ఆయన మండిపడ్డారు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి,భగత్ సింగ్, పటేల్ మహనీయులు మోదీ సర్కారు ఘనంగా గౌరవిస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రెండు కుటుంబాలే పాలిస్తున్నాయని ఆయన విమర్శించారు. అన్నింటికి మీ పేర్లు పెట్టుకోవద్దని, రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు చేసిన వారిని కూడా గుర్తు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఖాదీ సంతను సందర్శించాలని ప్రజలను కోరుతున్నానన్నారు. అనంతరం ఏపీ బీజేపీ సహ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్‌ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ పథకాలను గతంలో చంద్రబాబు, ఇప్పుడు సీఎం జగన్ తమ పేర్లు పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు అని ఆయన ఆరోపించారు. గుంటూరులో జిన్నాటవర్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశాన్ని‌ ప్రేమించేవారు జిన్నా పేరును‌ సమర్దించరని, బీజేపీకి‌ అవకాశం ఇస్తే రాష్ట్రంలో మాఫియాలను జైలుకు పంపుతామని ఆయన వెల్లడించారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏపీ డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధిస్తుందని ఆయన అన్నారు.

 

Show comments