Site icon NTV Telugu

Gutta Jwala : తెలుగు సినిమాలకి తెల్లగా ఉంటే చాలు : గుత్తాజ్వాల హాట్ కామెంట్స్

Gutta Jwala

Gutta Jwala

Gutta Jwala : తెలుగు సినిమాల్లో నటించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోతుంది అనే కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందం ఎక్స్ పోజ్ చేయడానికే ముంబై హీరోయిన్లను తెచ్చుకుంటారని చెప్పిన ఘటనలు కోకొల్లలు. మాజీ బ్యాడ్మింటన్ స్టార్ అయిన గుత్తా జ్వాల కూడా ఇలాంటి కామెంట్లే చేయడం సంచలనం రేపుతోంది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు.

Read Also : Pawan Kalyan: ‘‘తమిళ్ సినిమాలు హిందీలోకి డబ్బింగ్’’.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే ఆగ్రహం..

“నేను బ్యాడ్మింటన్ ఆడే టైమ్ లో నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ నేను నో చెప్పాను. మన తెలుగు సినిమాల్లో నటించాలంటే తెల్లగా ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా అవకాశాలు చాలా వచ్చేస్తాయి. నాకు అలా బోలెడన్ని ఛాన్సులు వచ్చినా చేయలేదు. కానీ నితిన్ కోసం గుండెజారి గల్లంతయిందే సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాను. కేవలం నితిన్ కోసమే అందులో చేశా. లక్కీగా అది మంచి హిట్ అయింది. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది” అంటూ గుత్తా జ్వాల చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version