NTV Telugu Site icon

Gutha Sukender Reddy: కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్‌ఎల్‌బీసీ అయిపోయేది!

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా.. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయేది అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సొరంగం మార్గంకు టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలని.. రాజకీయం చేయొద్దన్నారు. ఇంతకు ముందు పవర్ హౌజ్‌లో ప్రమాదం జరగలేదా?, కాళేశ్వరంలో జనాలు చనిపోలేదా? అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ ఎందుకు ఆలస్యం ఎందుకు అయ్యిందనేది కూడా మాజీమంత్రి హరీష్ రావుకి తెలుసు అని గుత్తా చెప్పుకొచ్చారు.

‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నీళ్లు తేవాలనేది ఆలోచన. సొరంగం మార్గం టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం. కృష్ణా బేసిన్లో వాటర్‌పై నిర్లక్షం జరిగింది. కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్‌ఎల్‌బీసీ అయిపోయేది. సీఎం, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు సమీక్షలు చేసే సమయం ఉండేది కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తుంది. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలి, రాజకీయం చేయొద్దు. ఇంతకు ముందు పవర్ హౌస్ లో ప్రమాదం జరగలేదా?. నువ్వు ఔను అంటే.. నేను కాదు అనడం మంచిది కాదు. హరీష్ రావుకి అన్ని తెలుసు.. ఎందుకు ఆలస్యం ఎందుకు అయ్యింది అనేది కూడా ఆయనకు తెలుసు. ఆత్మపరిశిలన చేసుకుంటే మంచిది. ప్రమాదం జరిగిన గంటలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పాట్లో ఉన్నాడు. నేతలు ఎంత మంది అక్కడికి పోతే.. అంత డిస్ట్రబ్’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నా. టన్నెల్ కి చాలా షరతులు పెట్టింది అటవీశాఖ. సౌండ్ రాకుండా డ్రిల్ చేయాలని నిబంధన పెట్టారు. హరీష్ రావు విమర్శలు అర్థరహితం. విమర్శలు చేసుకునే సమయమా? ఇది. ఆర్మీ పర్యవేక్షణ ఉంది.. టెక్నికల్ పర్సన్స్ మాట్లాడితే బాగుంటుంది. టన్నెల్ పనులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు పోవాల్సిందే. ప్రమాదం జరగడం సహజమే, ప్రమాదం పేరు చెప్పి ప్రాజెక్టులు పక్కన పెట్టరు. ఎస్‌ఎల్‌బీసీ వదిలేశం అంటే.. నిన్ననే హరీష్ రావు మూడు వేల కోట్లు ఖర్చు చేసినం అని అన్నాడు. ప్రాజెక్టు అనువైనది కాదన్నప్పుడు ఎందుకు మూడు వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరంకి ఇచ్చిన అడ్వాన్స్ లు ఎస్‌ఎల్‌బీసీ ఇస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యేది’ అని గుత్తా మండిపడ్డారు.