Things to do on Thursday As Per Astrology: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవతకి అంకితం చేయపడ్డాయి. గురువారం రోజు విష్ణువు మరియు దేవ గురువు బృహస్పతికి అంకితం చేయబడింది. ప్రతిసారి మీ పనులు మధ్యలో ఆగిపోతే.. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నాడని అర్ధం. దీనిని సమస్యను పరిష్కరించడానికి జ్యోతిషశాస్త్రంలో గురువారానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. జ్యోతిష్యంలోని ఈ 5 పరిష్కారాలను (Thursday Remedies For Money) ఓసారి ప్రయత్నించి చూడండి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉపాధ్యాయుల ఆశీస్సులు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువారంను విష్ణువు మరియు బృహస్పతి కాకుండా గురువుకు కూడా అంకితం చేయబడింది. ఈ రోజున మీ గురువు వద్ద ఆశీస్సులు తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ పురోగమిస్తుంది. అంతేకాదు ఆలయ పూజారి పాదాలను తాకి ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు.
నెయ్యి దీపం:
గురువారం తెల్లవారుజామున స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించాలి. తరువాత విష్ణు మరియు దేవగురు బృహస్పతిని పూజించండి. శ్రీమహావిష్ణువుని పూజించే సమయంలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి.. అందులో కాస్త కుంకుమ వేయండి.
పసుపు పండ్ల దానం:
వేద గ్రంధాల ప్రకారం.. జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేయడానికి పసుపు పండ్లను గురువారం రోజు దానం చేయాలి. బొప్పాయి, అరటి లాంటి పసుపు రంగులో ఉన్న పండ్లు దానం చేయొచ్చు. ఆసుపత్రికి వెళ్లి రోగులకు కూడా ఈ పండ్లు పంపిణీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల విష్ణువు సంతోశించి డబ్బు వర్షం కురిపిస్తాడు.
Also Read: World Cup 2023 Schedule: వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. టీమిండియా షెడ్యూల్ ఇదే!
విష్ణునామ స్తోత్రం:
కుటుంబంపై విష్ణువు ఆశీర్వాదం ఉండాలంటే గురువారం విష్ణునామ స్తోత్రం లేదా విష్ణు చాలీసా పఠించాలి స్నానం చేసిన వెంటనే పూజ గదిలో గంగాజలం చల్లి.. మొదటి గురువారం కథ చదవాలి. ఆ తర్వాత విష్ణుసహస్త్రాణం పఠించాలి.
విష్ణువుకు నైవేద్యం:
పాలు మరియు కుంకుమ పువ్వుతో ఖీర్ తయారు చేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కుటుంబం మొత్తం కలిసి ఆ ఖీర్ తినాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల కుటుంబంలో ఐకమత్యం బలపడి కుటుంబం ఆనందంగా ఉంటుంది.