Guntur Kaaram: భారీ ఫైట్ సీన్ తెరకెక్కించబోతున్న మేకర్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ సినిమా ”గుంటూరు కారం “ఈ సినిమాను మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కృష్ణ గారి బర్త్డే సందర్భంగా విడుదలయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు .ఈ సినిమా ను ఈ ఏడాది జనవరిలో మొదలు పెట్టారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.గత కొన్ని రోజులే క్రితమే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయింది.లాంగ్ గ్యాప్ తర్వాత షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇటీవలే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.ఆ తర్వాత కొద్దీ గ్యాప్ తోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. అయితే జులై 10 నుండి ఈ షెడ్యూల్ లో భారీ మాస్ యాక్షన్ ఫైట్ చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం… ఇక ఈ ఫైట్ ను కెజిఎఫ్ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసిన అనల్ అరసు ఆధ్వర్యంలో చేయనున్నారని సమాచారం.ఈ భారీ ఫైట్ సీన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నట్లు సమాచారం..
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ విధంగా షూటింగ్ కు ఏ మాత్రం బ్రేక్ పడకుండా చేస్తే ఈ సినిమా అనుకున్న సమయానికే పూర్తి అవుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటికే రకరకాల వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డే ను అనుకోగా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.. ఇక ఆమె స్థానంలో శ్రీలీలను మేయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు.. సెకండ్ లీడ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం… ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోయే సంగీతం అందించనున్నారు.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!