సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..
ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల నేపథ్యంలో సినిమా హాళ్లను అందంగా ముస్తాబు చేశారు.. థియేటర్ల వద్ద సూపర్ స్టార్ ఫ్యాన్స్ సందడి షూరు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే పలు థియేటర్స్ లో త్రివిక్రమ్, మహేష్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు.. సినిమా కన్నా ముందు థియేటర్ ముందు ఏర్పాటు చేసిన కటౌట్స్ చూసి సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు..
ఇకపోతే నైజం అభిమానులకు మహేష్ అంటే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లోనే చూడాలి అనుకుంటారు. అక్కడ జరిగే సెలబ్రేషన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ థియేటర్ వద్ద ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ మరెక్కడా కనిపించవు. గతంలో కొన్ని లకు ఫ్యామిలీ కలిసి వచ్చి మహేష్ చూశారు. అక్కడే అభిమానులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.. ఆ భారీ కటౌట్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
Viswanath decoration >>>
🥵🔥🔥@urstrulyMahesh #GunturKaraam pic.twitter.com/MGYlOcPAbm— 🦁VENKY🌶️ (@Dhfmvk18__) January 11, 2024
Few hours to go 🔥🔥🤙🏻#Gunturkaraam pic.twitter.com/ylfhDbmPrB
— SRINU PRINCE DHFMB 🌶️🔥💯 (@Srinu_prince12) January 11, 2024