NTV Telugu Site icon

Guna Shekar: వామ్మో.. ఆ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా

Guna Shekar

Guna Shekar

Guna Shekar: భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా శాకుంతలం. సమంత, దేవ్‌ మోహన్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ ఆలోచన లేకుండా శాకుంతలం సినిమా కోసం కొన్నేళ్లుగా కష్టపడుతున్నారు ఈ బడా డైరెక్టర్. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ ఏమిటనే దానిపై టాలీవుడ్ లో చర్చ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే శాకుంతలం తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ను మళ్లీ పట్టాలెక్కించబోతున్నారని సమాచారం.

Read Also: Gunasekhar: ఆ ఒక్క మాట చెప్పగానే.. మోహన్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

‘హిరణ్య కశ్యప’ అనే టైటిల్‌తో మరో పౌరాణిక సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు గుణశేఖర్. ఈ ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే మూడేళ్లు పని చేశారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ పక్కనపడింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌, స్క్రిప్ట్ వర్క్‌ పై చాలా కాలం పని చేసిన తర్వాత టైటిల్‌ రోల్‌ కోసం నటుడిని కూడా సెలక్ట్ చేశారు. ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ముంబైకి చెందిన ఒక ప్రొడక్షన్ హౌస్‌ కూడా ఓకే చెప్పింది.‘హిరణ్య కశ్యప’ టైటిల్‌ రోల్‌ కోసం రానాను ఎంపిక చేశారు. రానా కూడా ఆ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈలోపే కరోనా కారణంగా సినిమా పక్కనపడింది. ఈ లోగా రానా కూడా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ప్రాజెక్ట్‌ నిలిచిపోయింది. ఈ మధ్యలో సమంత ముఖ్య పాత్రలో శాకుంతలం సినిమా తెరకెక్కించారు గుణశేఖర్. దాని తర్వాత ‘హిరణ్య కశ్యప’ను తెరకెక్కించాలని గుణశేఖర్ అనుకుంటున్నారు. అయితే టైటిల్ రోల్‌ను రానా చెయ్యడం లేదని తెలుస్తోంది. పరిస్థితులు మారినందున క్యాస్టింగ్ గురించి మరోసారి ఆలోచిస్లున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ ను తామే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు గుణశేఖర్. హిరణ్య కశ్యప సినిమాలో టైటిల్‌ రోల్‌ను రానా కాకుండా ఎవరిని ఎంపిక చేయనున్నారని చర్చ జరుగుతోంది.

Show comments