దర్శకధీరుడు రాజమౌళి అంటేనే బాహుబలి, RRR వంటి వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్టులు గుర్తొస్తాయి. కానీ, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దృష్టిలో మాత్రం రాజమౌళి తీసిన సినిమాలన్నింటిలోకి ‘ఈగ’ (Eega) ఇప్పటికీ బెస్ట్ సినిమా అంట. తాజాగా తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రమోషన్లలో పాల్గొన్న గుణశేఖర్, రాజమౌళి పనితీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కెరీర్‌ను ‘ఈగ’ సినిమాకు ముందు, ఆ తర్వాత మిగతవి అని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : Lokesh Kanagaraj : ‘రెండో పెళ్లి’ ప్రశ్నలపై.. లోకేష్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్..
గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘కంటికి సరిగ్గా కనిపించని ఒక ఈగను హీరోగా పెట్టి, CGI గ్రాఫిక్స్‌తో దాని చుట్టూ అద్భుతమైన ఎమోషన్ పండించడం సామాన్యమైన విషయం కాదు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన మేకింగ్‌తో రాజమౌళి ఆ సినిమాలో మ్యాజిక్ చేశారు’ అని గుణశేఖర్ కొనియాడారు. రాజమౌళి ఆ తర్వాత గ్లోబల్ స్థాయిలో హిట్లు కొట్టినప్పటికీ, ఒక టెక్నీషియన్‌గా ఆయన విజన్‌కు ‘ఈగ’ ఒక బెంచ్‌మార్క్ అని.. ఒక గ్రాఫిక్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను మెప్పించడం అనేది రాజమౌళి క్రియేటివిటీకి నిదర్శనమని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం గుణశేఖర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ఫ్యాన్స్ కూడా జక్కన్న తీసిన ‘ఈగ’ ఒక మాస్టర్ పీస్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
