NTV Telugu Site icon

Gun Theft: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తుపాకీ చోరీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Gun

Gun

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తుపాకీ చోరీ కలకలం రేపుతుంది. 30 రౌండ్లతో కూడిన ఇన్సాస్ 60 వెపన్ చోరీ అయింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు చెందిన ఇన్సాస్ 60 వెపన్ మాయం అయిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో తుపాకిని రికవరీ చేసి అప్పగించారు. ఇన్సాస్ 60 ఎత్తుకొని పోయిన ఆనందమూర్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరుడుగట్టిన నేరస్తులు చోర్ కైసర్ ను సైతం అరెస్ట్ చేశారు.

Read Also: Snake in Car: వామ్మో పాము.. కారు సీటు కవర్‌లో ప్రత్యక్షం..

అయితే మరోవైపు, చోర్ కైసర్ అనే కరుడు గట్టిన నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని చంపేందుకు చోర్ కైసర్ సుపారి తీసుకున్నాడు.. రెండు లక్షల రూపాయల సూపారీ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యర్థులను చంపకుండా సుపారి ఇచ్చిన వ్యక్తినే చోర్ కైసర్ బెదిరించాడు.. అధిక మొత్తంలో డబ్బులు కావాలని అతడు డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు పట్టుబడటంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇక, చోర్ కైసర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటి వరకు పలు హత్య కేసులతో పాటు దోపిడీ కేసుల్లో చోర్ కైసర్ నిందితుడిగా ఉన్నాడు. నేరాలకు పాల్పడుతూ 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను చోర్ కైసర్సంపాదించినట్లు పోలీసులు పేర్కొ్న్నారు.