Site icon NTV Telugu

Gun Firing In Mumbai: ముంబైలో సినిమా స్టైల్‎లో గన్ ఫైర్.. కార్ల వెనుక దాక్కొని మరీ..

Gunfire

Gunfire

Gun Firing In Mumbai: ముంబై నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధన్ ధన్ అని మోగుతున్న శబ్ధాలకు నివ్వెరపోయారు. తమ చుట్టూ ఏం జరుగుతోందంటూ కాసేపు స్తంభించిపోయారు. ఆదివారం రాత్రి ఎద్దుల బండ్ల పోటీల నిర్వహణలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది. వ్యక్తుల మధ్య గొడవ కాస్త ఇరువర్గాలకు పాకింది. దీంతో ఓ వర్గం మరో వర్గం వారిపై కాల్పులకు దిగారు. సుమారు 15-20 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం.

Read Also: Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం.. ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ..

ప్రధాన రహదారికి దూరంగా పార్క్‌ చేసిన వాహనాల చుట్టూ కొంతమంది నిలబడి ఉండగా, కాల్పులు జరగడం, కొందరు కార్ల వెనుక దాక్కోవడానికి యత్నిస్తుండగా, మరికొందరు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ముంబై సమీపంలోని ఓ వీధిలో ఈ రోజు తుపాకులతో కాల్పులు జరిగాయి. అంబర్‌నాథ్‌లో ఆదివారం రాత్రి ఎద్దుల బండి పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. దాంతో ఒక వర్గం అకస్మాత్తుగా మరొకరిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. శివాజీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Exit mobile version