NTV Telugu Site icon

Gummanuru Jayaram:2024 ఎన్నికల్లో మరోసారి జగన్ ను సీఎం చేద్దాం

Minister Gummanur Jayaram

Minister Gummanur Jayaram

కర్నూలులో వాల్మీకుల కృతజ్ఞత సభ జరిగింది. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ డా.మధుసూదన్ పాల్గొని ప్రసంగించారు. జెడ్పీ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రత్యేక ఆకర్షణగా ఒంటె పై మాజీ మేయర్ బంగి ఆనంతయ్య ఊరేగారు. ఈ సందర్భంగా ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడారు. 70 ఏళ్ళులోగా వాల్మీకులకు ఏ రాజకీయ పార్టీ వాల్మీకులను గుర్తించలేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక వాల్మీకులకు స్వతంత్రం కల్పించి పదవులు ఇచ్చారు.

Read Also: Maoist letter: మావోయిస్టు లేఖ కలకలం.. ఎమ్మెల్యేకి బెదిరింపులు

వాల్మీకులకు ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబం అండగా నిలుస్తుంది.వాల్మీకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రేమ అభిమానం ఉంది..ఒక్క మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు జయరాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలో తీర్మానం పెట్టేందుకు కొందరు అడ్డుకున్నారు. అయినా వాల్మీకులకు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం హామీలను అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో వాల్మీకులకు ఏ ఒక్క పదవి ఇవ్వకుండా విస్మరించారు. సీఎం జగన్ ప్రభుత్వం లో‌ వాల్మీకులను రాజకీయంగా పెద్ద పీట వేశారు. రాష్ట్రంలో వాల్మీకులు 40లక్షల మంది వున్నారు.‌ వీరు అందరూ బాగుండాలంటే మరోసారి సీఎం జగన్ కు అండగా నిలిచి, 2024 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని భూస్థాపితం చేద్దాం. 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ ను సీఎం గా చేసుకుందాం అన్నారు.

Read Also:Sandra venkata verayya: వాళ్ల మాదిరి కులాల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేయడంలేదు