గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదంపై బాధితులు మీడియా ముందుకు వచ్చారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని సంచలన కామెంట్స్ చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరుపాలని సంతోషి గుప్త అనే బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే మా ఫ్యామిలీలో 17 మంది నీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడటం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గంట వరకు అగ్నిమాపక శాఖ వాహనాలు రాలేదని తెలిపారు.
READ MORE: PL 2025: ఫైనల్‌లో ఆర్సీబీ ఓడిపోతే.. నా భర్తకు విడాకులు ఇచ్చేస్తా..
ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ ఇంజన్ వాహనాల్లో సరైన సిబ్బంది, నీటి సదుపాయం లేదని సంతోష్ గుప్త ఆరోపించారు. ఫైర్ సిబ్బంది వద్ద సరైన పరికరాలు లేకపోవడంతో లోపలికి వెళ్లలేదని.. భవనం పైకి ఎక్కెందుకు కనీసం టైర్ సిబ్బంది వద్ద నిచ్చెనలు కూడా లేవని వెల్లడించారు.
గోడలను పగలకొట్టేందుకు ఫైర్ సిబ్బంది వద్ద పరికరాలు కూడా లేవని.. సంఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చిందన్నారు. ఐదు నిమిషాల్లో మంటలు ఆర్పి లోపలీకి వెళ్లి ఉంటే తమ వాళ్లు ప్రాణాలు దక్కేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ ఏం చేయకుండా ఉండిపోయారని తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లితే ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో ముగ్గురు చనిపోయారని ఆరోపించారు. పోలీస్ కేసు నమోదు కాకుంటే తాము వైద్యం చేయమని డాక్టర్లు నిరాకరించినట్లు వెల్లడించారు. ఉస్మానియా వైద్యులు చికిత్సకు నిరాకరించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండేందుకే న్యాయ విచారణ జరగాలని కోరారు.
READ MORE: Haryana: హర్యానా సీఎం సైనీ నివాసానికి బాంబు బెదిరింపు.. హైఅలర్ట్ ప్రకటన
