NTV Telugu Site icon

Ponnam Prabhakar : గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు

Ponnam Prabhakar

Ponnam Prabhakar

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి లో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గల్ఫ్ కార్మిక కుటుంబాల పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. అయితే.. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పదేండ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. పార్టీ మేని ఫెస్టోల్లో సైతం అంశాన్ని చేర్చి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్‌ ఏనాడు పట్టించుకోలేదు. అయితే.. ఎన్ఆర్ఐ పాలసీ పై తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈనెల 17న సీఎం ప్రత్యేకంగా భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించకుంది.

K.K. Mahender Reddy : ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి నేత కార్మికులకు పని కల్పిస్తాం