NTV Telugu Site icon

Viral Video : అరె ఎంట్రా ఇది.. గులాబ్ జామ్ తో ప్రయోగాలెంట్రా బాబు..

Gulab Jam (2)

Gulab Jam (2)

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు ఆహా అనిపిస్తే మరికొన్ని వీడియోలు ఎందుకు ఈ ఖర్మ అనిపిస్తున్నాయి.. ఇటీవల మ్యాగీతో ఐస్ క్రీమ్ ను చూసాము.. అలాగే చాక్లేట్ తో రకరకాల వంతకాలను చూసాము.. అంతేకాదు గులాబ్ జామ్ దోసను కూడా మీరు చూసే ఉంటారు.. ఇప్పుడు గులాబ్ జామ్ తో నూడిల్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వింటుంటే డోకు వస్తుంది కదా కానీ ఇది నిజం.. ఎలా చేశాడో ఒకసారి చూద్దాం..

స్ట్రీట్ వ్యాపారులు కొందరు భోజన ప్రియులను ఆకట్టుకొనే ప్రయత్నం చెయ్యడంలో భాగంగా కొత్త కొత్త వంట ప్రయోగాలను చేస్తున్నారు.. గులాబ్ జామ్ అంటే అందరికి ఇష్టమే ఉంటుంది.. చూస్తే నోరు ఊరిపోతుంది.. అలాంటి స్వీట్ ను కూడా ఆఖరికి వదల్లేదు.. తమ స్వలాభాల కోసం కొందరి మనోభావాలను దెబ్బ తీస్తున్నారు.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏకంగా నూడిల్స్ లో గులాబ్ వేసి సర్వ్ చేశాడు.. ఆ వీడియోను చూసిన ఫుడ్ ప్రియులు కొందరు షాక్ అవుతున్నారు..

ఆ వీడియోలో ఓ స్ట్రీట్ ఫుడ్ తయారు చేసే వ్యక్తి ముందుకు నూడిల్స్ ను తయారు చేస్తాడు.. ఎగ్ నూడిల్స్ లాగా వీడియోలో కనిపిస్తుంది.. అన్ని సాస్లు వేసి చక చకా నూడిల్స్ ను తయారు చేస్తాడు.. రసాలు కారే గులాబ్ జామ్ ను తీసుకొని ముక్కలు ముక్కలుగా కోసి దానిపై గోబీ వేసినట్లు వేసి ఇస్తాడు.. నూడిల్స్ ఏమో కారం, గులాబ్ జామ్ తీపి రెండు కలిపి తినడం మనకు కష్టంగా ఉన్నా కూడా దాన్ని లోట్టలేసుకుంటూ తింటున్నారు.. ఏది ఏమైనా ఈ వీడియో ను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

View this post on Instagram

 

A post shared by @foodb_unk