NTV Telugu Site icon

Lord Krishna Tallest Statue: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ‌కృష్ణుడి విగ్రహం.. ఎక్కడంటే..

Pic

Pic

Lord Krishna Tallest Statue: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ‌కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ‘దేవభూమి ద్వారకా కారిడార్’లో భాగంగా ద్వారకా పట్టణంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణుడి విగ్రహం రానుందని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మొదటి దశ పనులు ప్రారంభమవుతాయని గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గాంధీనగర్‌లో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ ఈ విషయాన్ని ప్రకటించారు.

Read Also: Terrorists arrested: కశ్మీర్‌లో ఐదుగురు హిజ్బుల్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

ద్వారకలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, 3డి ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ జోన్, శ్రీ‌మ‌ద్ భ‌గ‌వ‌ద్గీత అనుభ‌వ క్షేత్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప‌లు ఆధ్యాత్మిక కేంద్రాల‌కు నిల‌యంగా దేవ భూమి ద్వార‌కా కారిడార్‌ను మార్చడం ద్వారా ఈ ప్రాంతాన్ని ప‌శ్చిమ భార‌త‌దేశంలోనే అతిపెద్ద ఆథ్యాత్మిక‌ కేంద్రంగా మార్చేందుకు చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

Read Also: Heavy snowfall in America : అమెరికాలో భారీ హిమపాతం.. 2270విమాన సర్వీసులు రద్దు

ద్వారకలోని ప్రధాన దేవాలయాన్ని జగత్ మందిర్ లేదా త్రిలోక్ సుందర్ అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని పశ్చిమ భారతదేశంలోనే అతిపెద్ద మత కేంద్రంగా మార్చడానికి ‘దేవభూమి ద్వారకా కారిడార్’ను అభివృద్ధి చేయాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి రుషికేష్ పటేల్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో పూర్వం కోల్పోయిన ద్వారకా నగరం అవశేషాలను ప్రజలు చూడగలిగే వ్యూయింగ్ గ్యాలరీని కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసి మొదటి దశకు సంబంధించిన పనులను ప్రారంభించాలని భావిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.