Site icon NTV Telugu

GT vs MI: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Mi Vs Gt

Mi Vs Gt

ఐపీఎల్ 2026లో నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో ఉన్న ముంబై జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం తప్ప మరో మార్గం లేదు. గత 5 మ్యాచ్‌లలో 4 ఓడిపోయి ముంబై చాలా పేలవమైన స్థితిలో ఉండగా, గుజరాత్ పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉంది. గిల్ కెప్టెన్సీలో ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 3 గెలిచి, 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version