Gujarat Titans Record: ముంబై చేతిలో ఘోర ఓటమి.. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Record: అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో భారీ ఓటమి చవి చూసింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన గుజరాత్ టైటాన్స్, కేవలం 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయి 99 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాటు గుజరాత్ టైటాన్స్ తమ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ ను నమోదు చేసింది.
SRH vs DC Playing XI: ఇరుజట్లకూ గాయాల టెన్షన్.. కమిన్స్, అక్షర్ పటేల్ ఆడతారా.?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. ఇంతకుముందు 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఇదే గ్రౌండ్ లో 89 పరుగులకే ఆలౌట్ అయ్యి వారి కనిష్ట స్కోర్‌ను నమోదు చేసుకొంది. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. ఈ నిర్ణయానికి తగిన విధంగా రబడా ప్రారంభంలోనే కీలక వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. డికాక్, డానిష్ మలేవర్ వికెట్లను త్వరగా పడగొట్టడంతో పాటు సూర్య కుమార్ యాదవ్ ను అద్భుత బంతితో ఔట్ చేశాడు.
అయితే ఆ తర్వాత తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ వైపు తిప్పాడు. కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయ శతకంతో రెచ్చిపోయాడు. అతడు ఆడిన చివరి 23 బంతుల్లోనే 82 పరుగులు చేయడం విశేషం. అలాగే నామన్ ధీర్ 45 పరుగులతో సహకరించడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 199/5 భారీ స్కోర్ సాధించింది.
TGSRTC Strike: మరో 24 గంటల్లో ఆర్టీసీ సమ్మె.. చర్చలు ఫలిస్తాయా.?
లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్ సాయి సుదర్శన్ తొలి బంతికే ఔట్ అవ్వడంతో జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్ లో తన తొలి వికెట్ నమోదు చేశాడు. అనంతరం అశ్వని కుమార్ కేవలం 24 పరుగులకు 4 వికెట్లు తీసి గుజరాత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. వీరికి తోడుగా ఏఎం ఘజన్‌ఫర్, మిచ్చెల్ స్యాంటర్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తమ స్థాయిని మెరుగుపరుచుకోగా, గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు ఓటములతో ఆరో స్థానానికి పడిపోయింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..