ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 6 విజయాలు సాధించి.. 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలైంది. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ దెబ్బతింది. ఆపై ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై గెలిచిన జీటీ.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయాలు అందుకుంది. కోల్‌కతాపై విజయంతో ఐపీఎల్ 2025లోని అన్ని విభాగాల్లో గుజరాత్ టాప్ లేపింది.
టేబుల్ టాపర్:
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 12 పాయింట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జీటీ అగ్రస్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు గుజరాత్ ఫామ్ చూస్తే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. మిగిలిన 6 మ్యాచ్‌లలో 2 విజయాలు అంటే ఏ జట్టుకైనా సాధ్యమే.
ఆరెంజ్ క్యాప్:
సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025లో 400 పరుగుల మార్క్‌ను దాటాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హాఫ్ సెంచరీ (52) చేయడంతో.. ఓవరాల్‌గా 417 రన్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను సాయి సుదర్శన్ సొంతం చేసుకున్నాడు.
పర్పుల్ క్యాప్:
ఐపీఎల్ 2025లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా రాణిస్తున్నాడు. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో 2 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 8 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.
ప్రస్తుతానికి ఐపీఎల్ 2025లో పాయింట్ల పట్టిక, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అన్ని కూడా గుజరాత్ టైటాన్స్‌వే కావడం విశేషం. ప్రస్తుతం అన్నీ జీటీవే కావడంతో గుజరాత్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ హవా’, ‘అన్నీ మీవేనా రా అయ్యా’, ‘ఈసారి టైటిల్ మీదే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
