ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకోగా… ఢిల్లీ బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఇదే అత్యల్ప స్కోరు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టాన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చూస్తే… లోయర్ ఆర్డర్ లో రషీద్ ఖాన్ చేసిన 31 పరుగులే అత్యధికం.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ 100లోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 2024 సీజన్‌లో ఓ జట్టు 100లోపు ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేసిన 89 పరుగుల స్కోర్.. ఇపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ ఇదే అత్యల్ప టీమ్ స్కోర్.