Site icon NTV Telugu

Delivery Boy: తనే ఆర్డర్ చేసి, ఆపై క్యాన్సిల్ చేసి.. డ్యూప్లికేట్ వస్తువులతో కంపెనీకే కన్నం పెట్టిన డెలివరీ బాయ్

Delivery Boy

Delivery Boy

Delivery Boy: సూరత్‌లోని అడాజన్‌లోని ఎస్ఎన్ ఎంటర్‌ప్రైజ్‌కి చెందిన ఓ డెలివరీ బాయ్ మోసం చేయడానికి ఒక ప్రత్యేకమైన టెక్నిక్‌ని అనుసరించాడు. డెలివరీ బాయ్ తన మొబైల్ నుండి ఆర్డర్ చేసిన తర్వాత దానిని క్యాన్సిల్ చేసేవాడు. వచ్చిన పార్శిల్లో ఒరిజినల్ వస్తువులను తీసివేసి నకిలీ వస్తువులను తిరిగి కంపెనీకి అప్పగించేవాడు. ఇదే తరహాలో ఈ కేటుగాడు కంపెనీని రూ.3.69 లక్షల మేర మోసం చేశాడు. మోసం బయటపడడంతో కంపెనీ యజమాని, ఇతర డెలివరీ బాయ్స్‌ షాక్‌కు గురయ్యారు.

Read Also:Leo: రెండో రోజు వంద కోట్ల డ్రాప్… మండేకి పరిస్థితి ఏంటి?

పాండేసర నోవా కాంప్లెక్స్‌ సమీపంలోని దీనదయాళ్‌నగర్‌లో నివాసం ఉంటున్న శివం సత్యప్రకాష్‌ తివారీ (23) ఎస్‌ఎన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సెడోఫాక్స్ పేరుతో ఈ కంపెనీ బ్రాంచ్ అడాజన్ నూతన్ రో హౌస్‌లో ఉంది. అయితే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అల్తాన్ భీమ్రాడ్ కెనాల్ రోడ్ యాక్సెస్‌లో ఉంది. జూలై-2023లో సంగ్రామ్‌పురలోని అక్బర్ షహీద్ మౌండ్ సమీపంలో నివసించే సమీర్ అయూబ్ ఖాన్ పఠాన్‌ను శివం నియమించుకున్నాడు. సమీర్‌కు వివిధ ప్రాంతాలకు పార్శిళ్లను పంపిణీ చేసే పని అప్పగించారు. ఒకటిన్నర నెలలు పనిచేసిన సమీర్ ఉద్యోగం మానేశాడు. సమీర్ పని చేస్తున్న సమయంలో చాలా ఆర్డర్లు క్యాన్సిల్ అవుతుండగా, తిరిగి వచ్చిన ఆర్డర్లలో నకిలీ వస్తువులు దొరికేవి. దీంతో అనుమానం వచ్చింది. ఆ తర్వాత అసలు నిజం బయటకు వచ్చింది.

Read Also:Jawan: KGF 2 కలెక్షన్స్ ని అడుగు దూరంలోనే ఆగిపోయాడు

ఈ విషయాన్ని విచారించగా సమీర్ స్వయంగా తనే వేరే మొబైల్ నంబర్ నుండి ఆర్డర్ చేస్తున్నాడని తేలింది. ఈ సరుకులు డెలివరీకి ఇచ్చినప్పుడు, అతను వస్తువులను తెరిచి.. దాని నుండి అసలు వస్తువులను తీసి దాని స్థానంలో నకిలీ వస్తువులను ఉంచేవాడు. పార్శిల్‌ను తిరిగి ప్యాక్ చేసి తిరిగి ఇచ్చేవాడు. ఈ విధంగా సమీర్ నెలలో 68 పార్శిళ్ల ఆర్డర్‌ను రద్దు చేసి రూ.3.68 లక్షల విలువైన వస్తువులను డ్రా చేసి మోసం చేశాడు. మరోవైపు న్యూ బమ్రోలి రోడ్డులోని మరాఠా నగర్‌లో నివసించే డెలివరీ బాయ్ జశ్వింద్ర శత్రుఘ్నసింగ్ చౌహాన్ సమీర్‌తో పాటు పలు పార్శిళ్లను దొంగిలించాడు. దీంతో వారిద్దరిపై అడజాన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version