Delivery Boy: తనే ఆర్డర్ చేసి, ఆపై క్యాన్సిల్ చేసి.. డ్యూప్లికేట్ వస్తువులతో కంపెనీకే కన్నం పెట్టిన డెలివరీ బాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delivery Boy: సూరత్‌లోని అడాజన్లోని ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్కి చెందిన ఓ డెలివరీ బాయ్ మోసం చేయడానికి ఒక ప్రత్యేకమైన టెక్నిక్‌ని అనుసరించాడు. డెలివరీ బాయ్ తన మొబైల్ నుండి ఆర్డర్ చేసిన తర్వాత దానిని క్యాన్సిల్ చేసేవాడు. వచ్చిన పార్శిల్లో ఒరిజినల్ వస్తువులను తీసివేసి నకిలీ వస్తువులను తిరిగి కంపెనీకి అప్పగించేవాడు. ఇదే తరహాలో ఈ కేటుగాడు కంపెనీని రూ.3.69 లక్షల మేర మోసం చేశాడు. మోసం బయటపడడంతో కంపెనీ యజమాని, ఇతర డెలివరీ బాయ్స్ షాక్‌కు గురయ్యారు.
Read Also:Leo: రెండో రోజు వంద కోట్ల డ్రాప్… మండేకి పరిస్థితి ఏంటి?
Also Read
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
పాండేసర నోవా కాంప్లెక్స్ సమీపంలోని దీనదయాళ్‌నగర్‌లో నివాసం ఉంటున్న శివం సత్యప్రకాష్ తివారీ (23) ఎస్ఎన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సెడోఫాక్స్ పేరుతో ఈ కంపెనీ బ్రాంచ్ అడాజన్ నూతన్ రో హౌస్‌లో ఉంది. అయితే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అల్తాన్ భీమ్రాడ్ కెనాల్ రోడ్ యాక్సెస్‌లో ఉంది. జూలై-2023లో సంగ్రామ్పురలోని అక్బర్ షహీద్ మౌండ్ సమీపంలో నివసించే సమీర్ అయూబ్ ఖాన్ పఠాన్‌ను శివం నియమించుకున్నాడు. సమీర్‌కు వివిధ ప్రాంతాలకు పార్శిళ్లను పంపిణీ చేసే పని అప్పగించారు. ఒకటిన్నర నెలలు పనిచేసిన సమీర్ ఉద్యోగం మానేశాడు. సమీర్ పని చేస్తున్న సమయంలో చాలా ఆర్డర్లు క్యాన్సిల్ అవుతుండగా, తిరిగి వచ్చిన ఆర్డర్లలో నకిలీ వస్తువులు దొరికేవి. దీంతో అనుమానం వచ్చింది. ఆ తర్వాత అసలు నిజం బయటకు వచ్చింది.
Read Also:Jawan: KGF 2 కలెక్షన్స్ ని అడుగు దూరంలోనే ఆగిపోయాడు
ఈ విషయాన్ని విచారించగా సమీర్ స్వయంగా తనే వేరే మొబైల్ నంబర్ నుండి ఆర్డర్ చేస్తున్నాడని తేలింది. ఈ సరుకులు డెలివరీకి ఇచ్చినప్పుడు, అతను వస్తువులను తెరిచి.. దాని నుండి అసలు వస్తువులను తీసి దాని స్థానంలో నకిలీ వస్తువులను ఉంచేవాడు. పార్శిల్‌ను తిరిగి ప్యాక్ చేసి తిరిగి ఇచ్చేవాడు. ఈ విధంగా సమీర్ నెలలో 68 పార్శిళ్ల ఆర్డర్‌ను రద్దు చేసి రూ.3.68 లక్షల విలువైన వస్తువులను డ్రా చేసి మోసం చేశాడు. మరోవైపు న్యూ బమ్రోలి రోడ్డులోని మరాఠా నగర్లో నివసించే డెలివరీ బాయ్ జశ్వింద్ర శత్రుఘ్నసింగ్ చౌహాన్ సమీర్‌తో పాటు పలు పార్శిళ్లను దొంగిలించాడు. దీంతో వారిద్దరిపై అడజాన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!