NTV Telugu Site icon

Islamic State terrorists Arrest: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అరెస్ట్..

1

1

దేశంలో ఐదో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. ఓ వార్త కలవరపెడుతుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. కేంద్ర ఏజెన్సీల నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా గుజరాత్ ఏటిఎస్ (ATS) ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ నలుగురు ఉగ్రవాదులకు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు.

Read Also: S.V.Madhav Reddy SP: అల్లర్లు సృష్టిస్తే జిల్లా బహిష్కరణ, కఠిన చర్యలు తప్పవు

ప్రాథమిక సమాచారం ప్రకారం.. నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుండి చెన్నైకి.. అక్కడ నుండి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో.. ఉగ్రవావులను ఏటిఎస్ వారిని అరెస్టు చేసింది. నలుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు శ్రీలంక పౌరులు కాగా, మిగిలిన ఇద్దరు ఇస్లామిక్ స్టేట్‌కు చెందినవారు. కాగా.. ఈ ఉగ్రవాదులు గుజరాత్‌కు ఎందుకు వచ్చారు.. వారి ప్లాన్ ఏమిటి.. గుజరాత్, భారతదేశంలో వారికి హ్యాండ్లర్ ఎవరు వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం గుజరాత్ ఏటిఎస్ వారిని విచారించడం ప్రారంభించింది. సాయంత్రం 4 గంటలకు మరింత సమాచారంతో ఏటీఎస్ నుంచి విలేకరుల సమావేశం జరిగే అవకాశం ఉంది.

Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మరోసారి రిమాండ్ పొడిగింపు