ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనమే కొట్టేసి పరారయ్యాడు. అదీ కూడా పోలీస్ స్టేషన్‌లోనే.. దర్జాగా పోలీస్ వాహనంలో పారిపోయిన సంఘటన గుజరాత్‌లోని ద్వారకాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దొంగను గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు. వివరాలు.. గుజరాత్‌కు చెందిన మోహిత్ శర్మ బైక్‌పై ద్వారకా వచ్చాడు. ఈ క్రమంలో ద్వారక పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ పార్క్ చేశాడు. ఆ తర్వాత ద్వారక పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన ఉన్న ఎస్‌యూవీ పోలీస్ వాహనంలో అక్కడ నుంచి పారిపోయాడు.
Also Read: Pakistan: పాకిస్థాన్‌లో ఈ సారి న్యూఇయర్ వేడుకలు లేవు.. ఎందుకో తెలుసా?
అందులో డీజిల్ ఫుల్‌గా ఉండటంతో దాదాపు 200 కిమీ వరకు ప్రయాణించి జూమ్‌నగర్ చేరుకున్నాడు. మార్గం మధ్యలో పోలీస్ వాహనంలో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగు చూసింది. దాంతో స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లు అలర్ట్ అయ్యి చెక్ చేసుకోగా ఇది ద్వారకా పోలీసు స్టేషన్ వాహనంగా గుర్తించారు పోలీసులు. తమ వాహనం లేదని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేసి అతడి కోసం గాలించారు. చివరకు ఆరు గంటల తర్వాత పోలీస్ వాహనంతో ఉన్న మోహిత్ శర్మను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: MEA on Qatar: న్యాయబృందంతో చర్చిస్తాం.. ఖతార్ అంశంపై ప్రభుత్వ తొలి స్పందన ఇదే..
విచారణలో మోహత్ శర్మ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. గతంలో తాను అరెస్టైన ఓ కేసు దర్యాప్తులో పోలీసు వాహనాన్ని దొంగలిస్తానని చెప్పాడట. ఈ మేరకు దానిని అమలు చేశానని శర్మ విచారణలో చెప్పాడు. అది విని పోలీసులు షాక్ అయ్యారు. మోహిత్ శర్మపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా గతంలో మోహిత్ శర్మ కచ్‌లోని గాంధీధామ్‌లో పరువు నష్టం కేసు ఎదుర్కొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు గంజాయికి బానిసై మోహిత్ మత్తులోనే పోలీసు వాహనం దొంగలించినట్టు సమాచారం.