NTV Telugu Site icon

Gujarat : ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు స్పాట్ డెడ్..

gujarath

gujarath

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.. రెండేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.. బుధవారం భరూచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు..

వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో బుధవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం హన్సోట్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండేళ్ల బాలుడితో సహా మొత్తం ఆరుగురు ఒకే కారులో భరూచ్ నుంచి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో మరో కారు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయనీ, మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. మృతుల్లో వృద్ధ దంపతులు ఇంతియాజ్ పటేల్, ఆయన భార్య సల్మాబెన్, వారి వివాహిత కుమార్తెలు మారియా, అఫిఫా, ఇంతియాజ్ పటేల్ సోదరుడు జమీలా పటేల్ భార్య ఉన్నారు..

అయితే ఈ ప్రమాదంలో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. ప్రస్తుతం ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారనీ, 50 ఏళ్ల వయసున్న ఇంతియాజ్ పటేల్ కారు నడుపుతున్నారని, ప్రమాద సమయంలో సీటు బెల్ట్ కూడా ధరించారని తెలిపారు.. ఈ ప్రమాదంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఐదుగురు చనిపోయారని పోలీసులు గుర్తించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Show comments