NTV Telugu Site icon

Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!

Bhupendra Patill

Bhupendra Patill

నేడు తెలంగాణ రాష్ట్రానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రానున్నారు. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనబోతున్నారు. కాగా, ఇవాళ రాత్రి సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో విజయ సంకల్ప యాత్ర రోడ్ షోలో పాల్గొననున్నారు.

Read Also: Astrology: ఫిబ్రవరి 26, సోమవారం దినఫలాలు

ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్య ప్రెస్, ముషీరాబాద్ చౌరస్తా, బైబిల్ హౌస్, హిల్ స్ట్రీట్, షోలాపూర్ స్వీట్ షాప్, మహంకాళి స్ట్రీట్, సన్ షైన్ హాస్పిటల్, పీజీ రోడ్. పాటిగడ్డ, బేగంపేట్ రైల్వే స్టేషన్, అమీర్ పేట గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగోకుల్ థియేటర్ ప్రాంతాల్లో రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. అలాగే, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జుబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని మోతీనగర్, జనప్రియ గ్రౌండ్, అంబేద్కర్ విగ్రహం, రాజీవ్ నగర్, యూసుఫ్ గూడా చెక్ పోస్ట్, శ్రీకృష్ణా నగర్, ఇందిరానగర్ లో జరిగే రోడ్ షోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.

Read Also: Gold Price Today : మరోసారి ఊరట కలిగిస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

ఇక, నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జుబ్లీ చెక్ పోస్ట్, క్యాన్సర్ ఆసుపత్రి, చింతల్ బస్తీ, ఖైరతాబాద్ బడా గణేశ్, లగ్డీకా పూల్ ప్రాంతాల్లో నిర్వహించే రోడ్ షోకు కిషన్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాసాబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి చౌరస్తా, సీతారాంబాగ్, కుమ్మర్ వాడిలో జరిగే రోడ్ షోలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొంటారు. అలాగే, రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో జరిగే కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొంటారు.

Show comments