NTV Telugu Site icon

Gudivada Amarnath : వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేస్తాం

Gudivada Amarnath

Gudivada Amarnath

ఏపీలో వికేంద్రీకరణపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే విపక్షాలు వికేంద్రీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ అభివృద్ధి- పరిపాలన వికేంద్రీకరణపై సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. గురువారం వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఈనెల 9న పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేస్తామని, జేఏసీ ద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

 

రైతుల పేరిట జరుగుతున్న యాత్రపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న గుడివాడ అమర్నాథ్… ప్రజల ఆకాంక్షకు భిన్నంగా అమరావతి యాత్ర జరుగుతోందని మండిపడ్డారు. యాత్రలో చెప్పులు చూపించడం, తొడలు కొట్టడం లాంటి పనులు చేయమని కోర్టు చెప్పలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడాలని ఉన్నా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. 29 గ్రామాల కోసం అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, 29 గ్రామాల కోసం 26 గ్రామాల కోసం 26 జిల్లాలు విడిచిపెట్టాలని కోరడం అన్యాయం అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.