Site icon NTV Telugu

GT vs RCB: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ..

Gt Vs Rcb

Gt Vs Rcb

ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో 45వ మ్యాచ్‌ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఏప్రిల్ 28న తలపడుతుండగా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంటది ఆర్సీబీ. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, నాలుగు విజయాలు సాధించగా, 5 పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 9 మ్యాచ్‌లు ఆడి, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

Also Read: Gam Gam Ganesha: ‘ గం..గం..గణేశా ‘ అంటున్న ఆనంద్‌ దేవర కొండ.. న్యూ మూవీ అప్డేట్..

ఇక నేటి మ్యాచ్ లీని ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు చూస్తే.. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, స్వప్నిల్ సింగ్ లు ఉన్నారు. ఇక మరోవైపు..

Also Read: Tim Seifert Batting: బంతిని బాదేందుకు భారీ డైవ్‌ చేసిన బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వులే!

గుజరాత్ టైటాన్స్ టీంలో శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మలు ఉన్నారు.

Exit mobile version