Site icon NTV Telugu

GST Raids on UV Creations : ప్రభాస్ సొంత సంస్థ యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు

Uv

Uv

GST Raids on UV Creations: ప్రభాస్ సొంత సంస్థ యూవీ క్రియేషన్స్ ఆఫీసులో జీఎస్టీ నిఘా విభాగం దాడులు నిర్వహించారు. హైదరాబాద్​లోని ఆఫీసులో తనిఖీలు నిర్వహించి.. వస్తున్న ఆదాయం, చెల్లిస్తున్న జీఎస్టీకి తేడా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. మరింత లోతైన పరిశీలనకు సంస్థకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ సంస్థ మీద జీఎస్టీ అధికారులు రైడ్స్ విషయం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Read Also: Hansika Motwani: కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల మీద సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు విడుదల చేసిన సమయంలో పన్ను ఏదైనా ఎగవేశారా? అనే విషయం మీద అధికారులు తనిఖీ చేసి ఆరా తీసినట్లు ప్రచారం కొనసాగుతోంది. అయితే అధికారుల తనిఖీ విషయాలు మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం మీద జీఎస్టీ అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. యూవీ క్రియేషన్స్ సంస్థ మాత్రం ఇలాంటి తనిఖీలు సాధారణం అని చెబుతోంది.

Read Also: Trivikram: బర్త్ డే సందర్భంగా ‘నువ్వే నువ్వే’ అంటున్న ఆయన అభిమానులు

యువీ క్రియేషన్స్ సంస్థను హీరో ప్రభాస్ వరుసకు సోదరుడైన ప్రమోద్ ఉప్పలపాటి ఆయన స్నేహితులు వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డితో కలిసి ముంబై బేస్ తో 2013లో స్థాపించారు. ఈ సంస్థ ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమా తీశారు. ఆ తర్వాత నాని హీరోగా భలే భలే మగాడివోయ్, శర్వానంద్ హీరోగా ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మహానుభావుడు, గోపీచంద్ హీరోగా జిల్, పక్కా కమర్షియల్, సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ, అనుష్క హీరోయిన్ గా విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలు నిర్మించారు. ఇప్పుడు కూడా ఆది పురుష్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Exit mobile version