Site icon NTV Telugu

Tonique Liquor: టానిక్ ఎలైట్ వైన్ షాప్ ల్లో జీఎస్టీ అధికారుల సోదాలు

Tonique

Tonique

GST Raids: టానిక్ మద్యం షాప్ లో అక్రమాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న ( సోమవారం) సాయంత్రం నుంచి GST అధికారుల సోదాలు చేస్తున్నారు. ఏ మద్యం షాప్ కు లేని వేసులుబాటు టానిక్ కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్ కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ కు మాత్రమే గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి పూర్తి విరుద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ముందుగా పాలసీలో అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్ షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్ కు 11 ఫ్రాంచైజ్ లు ఉన్నాయి.

Read Also: BIG Alert: ఈ ట్యాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు..

క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. ఏ షాప్ కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్ కు ఉన్నట్టు గుర్తించి జీఎస్టీ అధికారులు కంగుతింటున్నారు. 11 క్యూ టానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి నడిపారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ లో ముగ్గురు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాజీ ఉన్నతాధికారి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి భాగస్వామ్యం ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు.

Exit mobile version