NTV Telugu Site icon

GST Council Meet: జూలై 11న జీఎస్టీ మీటింగ్.. పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం..!

Gst

Gst

GST Council Meet: జూలై 11వ తేదీన ఢిల్లీలో జీఎస్టీ 50వ కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది. ఈసారి ఆన్ లైన్ గేమింగ్ పై ట్యాక్స్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆ సమావేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో హార్స్‌ రేస్‌లపై ట్యాక్స్‌కు ఆమోద ముద్ర వేయనుంది. మరోవైపు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మరిన్ని అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. నకిలీ రిజిస్ట్రేషన్, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందుకు మరికొన్ని చర్యలపై జీఎస్‌టీ కౌన్సిల్ చర్చించబోతోందని ఓ అధికారి తెలిపారు. తాము కొన్ని ఇతర చర్యల గురించి ఆలోచిస్తున్నామని, వాటిని లా కమిటీ, జీఎస్‌టీ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ చైర్మన్ వివేక్ జోహ్రీ అన్నారు.

Read Also: Esshanya Maheshwari Hot Pics: ఫ్రంట్ అండ్ బ్యాక్ పోజులతో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఈశాన్య మహేశ్వరి!

మరోవైపు ఈ గేమింగ్‌లపై ట్యా్క్స్‌ విధించే అంశాన్ని గత ఏడాది డిసెంబర్‌లో మంత్రుల బృందం తన నివేదికను కౌన్సిల్‌కు సమర్పించినప్పటికీ సమావేశంలో చర్చకు రాలేదు. అయితే ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, గుర్రపు పందేలపై మంత్రుల బృందం సమర్పించిన నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో గేమింగ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

Read Also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్‏కు ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా?

అంతేకాకుండా.. సిమెంట్‌పైవసూలు చేస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌పై (GST) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సిమెంట్‌పై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తోంది. దీంతో ఇల్లు కట్టుకునేవారికి భారంగా మారింది. దీంతో సిమెంట్‌పై జీఎస్‌టీ తగ్గించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఈసారి జరగబోయే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో సిమెంట్‌పై జీఎస్‌టీ తగ్గించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments