NTV Telugu Site icon

Viral : ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. డ్యాన్స్ తో అదరగొట్టేశారుగా..

Girls

Girls

ఈ మధ్యకాలంలో పిచ్చి్ ఫీక్స్ కు చేరినట్లు మనుషులు ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది అని ఆలోచించి ఇష్టం వచ్చినట్లుగా రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అలాగే ఈ మధ్య రీల్స్ చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన రీల్ వీడియో నెట్టింటా వైరలవుతోంది. ఓ ట్రెండింగ్ సాంగ్ కు ఆ యువతులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Also Read : Indias Gold Demand: పసిడికి భారీగా తగ్గిన గిరాకీ.. అసలు కారణం ఇదే..

ఈ షార్ట్ క్లిప్‌లో యువతుల టీమ్ ఓ ట్రెండింగ్ సాంగ్ బీట్స్‌కు త‌గ్గట్లుగా డ్యాన్స్ చేస్తుండటం మనకు కనిపిస్తుంది. అయితే వీళ్లలో ఇద్దరు వేర్వేరు బెర్త్‌లపై క్రేజీ మూమెంట్స్ ఇవ్వగా మిగిలిన‌వారంతా మిగత స్టెప్పులు వేస్తారు. అయితే ఈ వీడియోను ఇప్పటివరకు 45,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజ‌న్ల నుంచి మిశ్రమ స్పంద‌న వస్తోంది. మరికొందరూ యువ‌తుల తీరుపై విమ‌ర్శలు వ్యక్తం చేస్తున్నారు. నాలో ఇంత కాన్ఫిడెన్స్ లేద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. ముందు మెట్రో, ఇప్పుడు ట్రైన్లను టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని మ‌రో యూజ‌ర్ విమర్శిలు గుప్పించాడు. ఇలా ప్రయాణికులకు ఇబ్బందులకు గురిచేసే విధంగా ఇష్టానుసారంగా చేస్తున్న రీల్స్ తో తొటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Also Read : RSS: “స్వలింగ సంపర్కం ఓ రోగం”.. చట్టబద్ధం అయితే సమాజంలో పెరుగుతుంది..

Show comments