Site icon NTV Telugu

Group-4 Results: తొందరలోనే గ్రూప్-4 ఫలితాలు విడుదల

Group4

Group4

గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అయితే, జులై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో గ్రూప్‌-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది. అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో కమిషన్‌ మీటింగ్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్‌ కీని రిలీజ్ చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు నెలలోనే పూర్తి చేయాలని టీఎస్పీఎస్సీ అనుకుంటుంది.

Read Also: Professional Girlfriend: గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీలవుతున్నారా.. రోజుకో లక్ష పెడితే దొరికేస్తుంది

అయితే, సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో తుది ఫలితాలు ఇవ్వాలని యోచిస్తున్నది. గురువారంతో ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తవడంతో ఇతర ప్రక్రియను వేగవంతం చేయనుంది. రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది ఓఎంఆర్‌ షీట్లను స్కానింగ్‌ చేశారు. దీంతో కేవలం 20 రోజుల్లోనే 7,62,872 మంది ఓఎంఆర్‌ పత్రాల స్కానింగ్‌ పూర్తయింది. కేవలం 20 రోజుల్లో 7.62 లక్షల OMR పత్రాలను స్కానింగ్ చేశారు.

Read Also: India Gift To Vietnam: వియత్నాంకు భారత యుద్ధ నౌక .. కానుకగా ఇచ్చిన ఇండియా

గ్రూప్-4 పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అని అభ్యర్థులు వేచి ఉన్నారు. దీంతో టీఎస్పీఎస్సీ ఇప్పటికే ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ పూర్తి చేయడంతో ఆగస్టు నెలలో కీని రిలీజ్ చేసిన తర్వాత.. తుది ఫలితాలు రిలీజ్ చేసేందుకు సన్నాహాకాలు చేస్తుంది. దీంతో అభ్యర్థులు కీ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్-4కి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అనేక విమర్శలను ఎదుర్కొంటున్న కమిషన్ ఈసారి ఎలాంటి మిస్టేక్స్ జరుగకుండా చూసుకుంది.

Exit mobile version