Site icon NTV Telugu

Group 4 Exam : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-4 పరీక్ష

Group 4 Exam

Group 4 Exam

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-4 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8180 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కమిషన్ పేర్కొంది. పేపర్‌-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది హాజరు కాగా, పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Also Read : Manipur CM: అందుకే రాజీనామా చేయాలనుకున్నా.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్న..

కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు సరైనా సమయానికి చేరుకోలేకపోవడంతో పరీక్ష రాసేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో కొందరు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. గ్రూప్-4 పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. అయితే గ్రూప్ 4 పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న వైరల్‌గా అవుతోంది. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం మూవీ గురించి గ్రూప్‌-4లో ఒక ప్రశ్న వచ్చింది.

Also Read : ICC World Cup Qualifier: వెస్టిండీస్‌కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్‌కప్ నుంచి ఔట్

Exit mobile version