Site icon NTV Telugu

Viral : ఫోటో తీయమంటే.. ఫోటోకే దండేసేటట్టు చేశావు గదరా !

New Project (21)

New Project (21)

Viral : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. వాటిని చూసినప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి చర్చనీయాంశమైంది. ఇది పెళ్లికి సంబంధించిన వీడియో. పెళ్లి తర్వాత ఊరేగింపు నిర్వహించారు. పెళ్లిలో ఆఖరి ఘట్టం అప్పగింతల సమయంలో.. అంటే పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు తన ఇంటికి తీసుకెళ్లే సమయంలో గోడ అకస్మాత్తుగా కూలుతుంది. దీంతో అందరూ షాక్ తిని పరిగెత్తుతారు.

Read Also : Adipurush: ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది!

వైరల్ అవుతున్న వీడియో ఓ గ్రామానికి చెందినదిగా తెలుస్తోంది. వరుడు తన పెళ్లి ఊరేగింపుతో వచ్చాడు. పెళ్లి చేసి గ్రామస్తులు నిల్చున్నారు. కొత్త పెళ్లి కొడుకు కూడా నిలబడి ఉన్నాడు. వరుడి ముందు ఒక గోడ కనిపిస్తుంది.. దానిపై కొంతమంది నిలబడి వీడియోలు తీస్తున్నారు. ఈ సమయంలో ఓ కుర్రాడు గోడపై పెట్టిన రాయిపై తన ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నాడు. అతను కొంచెం ముందుకు వెళ్లే సరికి గోడ బ్యాలెన్స్ తప్పి బండ రాయి కింద నిలబడి ఉన్న వరుడిపై పడింది. దీంతో ఉన్న ఫళంగా అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. అందరూ ఏం జరుగుతుందో అని పరుగు లంకించుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను 87 లక్షల మందికి పైగా జనం చూశారు.

Exit mobile version