Viral Video : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ప్రస్తుతం చాలా తక్కువ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి వాటిలోనే ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి. ప్రతి ఒక్కరు పెళ్లి చాలా గొప్పగా, నలుగురు చెప్పుకునేలా చేసుకోవాలని భావిస్తారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది తమ జీవితంలోని మధుర క్షణాలను నలుగురితో షేర్ చేసుకుంటున్నారు. ఇది ప్రజలు చూడటమే కాకుండా వారి స్నేహితులను కూడా ట్యాగ్ చేస్తున్నారు. అలాంటి పెళ్లి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లలో చర్చనీయాంశమైంది.
Read Also:Nita Ambani: నీతా అంబానీ వాడే ఫోన్ ధర ఎంతో తెలుసా?
హిందువుల సంప్రదాయం ప్రకారం.. వరుడు గుర్రం పై పెళ్లి ఊరేగింపుగా వస్తాడు. ఇప్పుడు పెళ్లిళ్లలో వరుడి ఎంట్రీ వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో జేసీబీ పై వరుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇలాంటి ఎంట్రీని చాలా అరుదుగా చూసుంటారు. ఇది చూసి కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరైతే నవ్వు ఆపుకోలేకపోతున్నారు. వరుడు ట్రాక్టర్ జేసీబీలో కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. వరుడు జేసీబీ లోడర్‌పై నిలబడి ఉండగా, కింద ఉన్న బంధువులు అతడిని చూస్తుండిపోయారు. వరుడి ఈ వింత ఎంట్రీని కొందరు తమ ఫోన్లలో రికార్డు చేస్తుండగా.. కొందరు మాత్రం నవ్వుకుంటున్నారు.
Read Also:Padma Awards 2024: తైవాన్ పౌరుడికి పద్మభూషణ్ అవార్డు.. ఎందుకో తెలుసా..?
ఈ క్లిప్ @ck_official_555 అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు లక్షల మంది చూశారు. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్, ‘దీన్నే భయ్యా రాయల్ ఎంట్రీ అంటారు.’ మరొక నెటిజన్ ‘ఇది బ్యాంగింగ్ ఎంట్రీ’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.