NTV Telugu Site icon

Viral Video: వివాహ వేడుకలో విషాదం.. పెళ్లి బారాత్‭లో వరుడు గుండెపోటుతో మృతి

Die

Die

Viral Video: మధ్యప్రదేశ్ లోని శియోపూర్ జిల్లా‌లో పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారుడైన 25 ఏళ్ల వరుడు పెళ్లి ఊరేగింపు (బారాత్) సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూశాడు. సంప్రదాయ ప్రకారం గుర్రం పై ఊరేగిస్తూ వెళ్తుండగా, పెళ్ళికొడుకు అకస్మాత్తుగా కిందపడిపోయాడు. దానితో ఆనందోత్సాహంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా విషాద వాతావరణంగా మారిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Read Also: ACB Fake Calls: ఏసీబీ పేరుతో డబ్బులు డిమాండ్ చేసే నకిలీ కాల్స్‌పై డీజీ హెచ్చరిక

కుప్పకూలిన వరుడును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే దారుణం చోటుచేసుకుంది. వైద్యులు పరీక్షించిన అనంతరం అతను మరణించాడని ధృవీకరించారు. పెళ్లి వేడుకలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి వేడుక ఆనందంగా సాగాల్సిన వేళ, వరుడు ఊహించని మృతి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హఠాన్మరణం కుటుంబానికి తీరని లోటని గ్రామస్థులు పేర్కొన్నారు. పెళ్లి ముహూర్తానికి ముందు వరుడు ఇలా మరణించడాన్ని నమ్మలేకపొతున్నారు.