Site icon NTV Telugu

Groom voted: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు..

Groom Voted

Groom Voted

తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరికొద్ది నిమిషాలలో అతను వివాహం చేసుకున్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చాడు. అప్పటికే ముస్తాబాయి పెళ్లి కొడుకు శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని గందర్‌ బల్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్‌ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

Also Read: Revanth Reddy: ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం: రేవంత్ రెడ్డి

అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి విధి అని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని వివరించారు. ఉద్యోగాల కల్పనకు, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దోహదపడే వారిని నమ్మే అభ్యర్థికి తాను ఓటు వేశానని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో పారస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version