Site icon NTV Telugu

Green Papaya: పచ్చి బొప్పాయి అనేక సమస్యలకు దివ్యౌషధం.. ముఖ్యంగా ఈ సమస్యలకు చెక్

Green Papayya

Green Papayya

బొప్పాయి పండు అంటే అందరికీ ఇష్టమే.. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది రుచికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పండిన బొప్పాయి కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటే.. పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా.. పచ్చి బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. మలబద్ధకం, వికారం నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా.. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి మహిళలను రక్షిస్తుంది. అయితే.. గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తినకూడదు. పచ్చి బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

CM Revanth: కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది..

కామెర్లు
కామెర్లు.. వీటిని జాండిస్ అని కూడా పిలుస్తారు. ఇది తీవ్రమైన వ్యాధి. అయితే.. ఈ వ్యాధిని నివారించడానికి పచ్చి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. ప్రతి మూడు గంటలకోసారి అరగ్లాసు బొప్పాయి రసం తాగడం వల్ల జాండిస్‌లో ఉపశమనం లభిస్తుంది. బొప్పాయిలో డైజెస్టివ్ ఎంజైమ్ పాపైన్ ఉంటుంది. ఇది ప్రొటీయోలైటిక్ ఎంజైమ్.. దీని నుండి మందులు కూడా తయారు చేస్తారు. ఇవి.. కామెర్లు చికిత్సలో కూడా సహాయపడుతాయి.

ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది
పచ్చి బొప్పాయి యాంటీ పరాన్నజీవి, యాంటీ అమీబిక్.. ఇది ప్రేగు కదలికలతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్, గుండెల్లో మంట మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది .

ఆస్తమా
బొప్పాయి ఎండిన ఆకులు ఆస్తమాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది . 2022 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో బీటా కెరోటిన్, లైకోపీన్ మరియు జియాక్సంతిన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆస్తమా నుంచి నివారించవచ్చు.

మలేరియా
పచ్చి బొప్పాయిలో ఉండే విటమిన్ ‘ఎ’, ‘సి’ మలేరియా రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల మలేరియా, డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతుంది. ఇది అద్భుతమైన యాంటీ మలేరియా ఆయుర్వేద ఔషధం.

నొప్పి నుండి ఉపశమనం
బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ పనితీరులో సహాయపడుతుంది. ఇది పీరియడ్స్ ని నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. ఆ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Exit mobile version