NTV Telugu Site icon

MP Joginapally Santosh Kumar : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ భావితరాలకు స్ఫూర్తిదాయకం : ఆక్టివిస్ట్ డా.సతీష్ శిఖ

Mp Santhosh

Mp Santhosh

MP Joginapally Santosh Kumar : ‘గ్రీన్​ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని గ్లోబల్​వార్మింగ్​యాక్టివిస్ట్​డాక్టర్​సతీష్​శిఖ బీఆర్ఎస్​ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్ ను అభినందించారు. సతీష్ శిఖ ఈ రోజు ప్రగతి భవన్ లో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అధినేత సంతోష్ కుమార్‎ను కలిశారు. డాక్టర్ సతీష్ శిఖ ఓ ఫ్యాషన్ డిజైనర్. 2007లో తన వృత్తిని వదిలి గ్లోబల్ వార్మింగ్ ఆక్టివిస్ట్ గా మారారు. భారత్ లో పుట్టిన కెనాడా ఎన్నారై అయిన డాక్టర్ సతీష్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిగాను మంగోలియా దేశంలోని ఎకో ఏషియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత దేశమంతటా నిరుపేద పిల్లలకు మద్ధతు ఇవ్వడానికి ‘90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించాడు. ఇతను 2007 లో ఒక కిలోమీటర్ పొడవునా ‘ఎకో గ్రీన్ హ్యాండ్ మేడ్ సిల్క్ క్లాత్ ఫ్యాబ్రిక్’ ని నిర్మించారు. ఈ సిల్క్ క్లాత్ పై పర్యావరణానికి మద్దతుగా అనేక మందికి సందేశాలను అందించారు. 72 దేశాల నుండి సుమారు 1,263 మంది ప్రముఖులు, పర్యావరణ కార్యకర్తల సందేశాలతో సిల్క్ క్లాత్ 1.2 కి.మీ. కంటే ఎక్కువ పొడవుగా మారింది.

Read Also: Building Collapsed : కూకట్ పల్లి బిల్డింగ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ద్వారా పర్యావరణానికి చేస్తున్న విశేష కృషిని గుర్తించి సిల్క్ ఫ్యాబ్రిక్ పై తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా డాక్టర్ సతీష్ శిఖ అభ్యర్థించారు. పర్యావరణ పరిరక్షణకు తగిన చొరవ చూపుతున్న డాక్టర్ సతీష్ శిఖ కార్యక్రమానికి ముగ్ధుడైన సంతోష్ కుమార్ అతని అభ్యర్థనను గౌరవిస్తూ.. ‘‘మొక్కలను నాటండి, రక్షించండి, ప్రోత్సహించండి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దేశాన్ని తద్వారా భూగోళాన్ని రక్షించండి’’ అంటూ సిల్క్ ఫ్యాబ్రిక్ (పట్టు వస్త్రం)పై తన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ రాగి నాణేన్ని ఎంపీ సంతోష్ కుమార్ కు బహుమతిగా ఇచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను డాక్టర్ సతీష్ శిఖ ప్రశంసిస్తూ వాటిని నిరంతరంగా కొనసాగించాలని ఎంపీని అభ్యర్థించారు.