Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Green India Challenge Accepted By Pocharam

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన స్పీకర్ పోచారం

Published Date :October 2, 2021 , 11:26 am
By Lakshmi Narayana
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన స్పీకర్ పోచారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

చెట్ల పండగ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సరికొత్త పంథాలో ముందుకు సాగుతుంది. మంచి ఆశయానికి వెయ్యి మార్గాలు తోడు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వృక్షం, దసరాకు పూజించుకునే జమ్మి చెట్టును భాగం చేశారు నిర్వాహకులు. శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! అని అందరి పెదాలపై పూజ వినిపిస్తున్న ఊళ్లలో మాత్రం జమ్మి చెట్టు కనిపించడం కష్టంగా మారింది. అందుకే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో జమ్మిని భాగం చేశారు. గుడి గుడికి జమ్మి చెట్టును నాటే మహాసంకల్పాన్ని తీసుకున్నారు.

ఈ క్రమంలోనే, తెలంగాణ శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా అసెంబ్లీలో జమ్మి వృక్షాన్ని నాటారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును నాటడం అద్భుతమైన అనుభూతిని కలిగించింది. త్రేతా యుగంలో రాముడికి నీడనిచ్చి, అరణ్యవాసంలో పాండవుల ఆయుధాలకు స్థావరంగా నిలిచిన జమ్మి చెట్టును మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా చేసింది. ఇంతటి చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ప్రతీ ఊరిలో ఉండాలనే తలంపుతో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. వారి కృషి, సంకల్పం వల్ల రాబోయే రోజుల్లో ప్రతీ ఊళ్లో జమ్మి చెట్లు అందుబాటులో ఉంటాయి. చరిత్ర ఉన్నంత కాలం, తెలంగాణలో దసరా జరిగినంత కాలం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిలిచిపోయేలా వారు చేస్తున్న కృషికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నాయకులందరు నివాళుర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రొటెం ఛైర్మన్ వి. భూపాల్ రెడ్డి, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, బొగ్గారపు దయానంద్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, వుల్లోల గంగాధర్ గౌడ్, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ్మాచార్యులు, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Green India Challenge
  • mp santhosh kumar
  • Speaker Pocharam Srinivas Reddy
  • telanagana

తాజావార్తలు

  • Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!

  • Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

  • Shreyas Iyer Fined: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి చేస్తే మ్యాచ్ సస్పెన్షన్.?

  • GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions