NTV Telugu Site icon

Khammam: కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. తప్పిన పెను ప్రమాదం

Bridge Collapse

Bridge Collapse

Green Field Highway Bridge Collapse in Khammam District: ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు బ్రిడ్జి మించి ఒక్కసారిగా దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ఖమ్మం నుంచి ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో హైవే నిర్మాణం కొనసాగుతుంది. సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు నేషనల్ హైవే నిర్మాణం పూర్తయింది. కాగా ఖమ్మం నుంచి వైరా సత్తుపల్లి అశ్వరావుపేట, వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కొనసాగుతుంది.

Read Also: TTE Suspend: టికెట్ లేదని ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

అయితే వైరా వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. వైరా నుంచి మధిరకు వెళ్లే ప్రధానమైన రహదారిలో వైరా నుంచి తల్లాడ కి వెళ్లే రూట్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్రిడ్జి ఎందుకు కూలిపోయిందనే విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

 

Show comments