Benefits Of Eating Green Apples: ‘ఆపిల్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యాపిల్‌ను ‘ఆరోగ్య నిధి’ అని కూడా అంటారు. యాపిల్స్ పలు రంగులలో ఉంటాయి. సాధారణంగా ఎరుపు మరియు పసుపు ఆపిల్‌లను ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే గ్రీన్ ఆపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయడంతో పాటు అనేక వ్యాధులను దూరం చేస్తాయి. గ్రీన్ యాపిల్ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయానికి ప్రయోజనకరం:
గ్రీన్ యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు మరియు డిటాక్సిఫైయింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. అదే సమయంలో హెపాటిక్ పరిస్థితుల నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. రోజూ గ్రీన్ యాపిల్ తింటే.. లివర్ పనితీరు సరిగ్గా ఉంటుంది.
మానసిక ఆరోగ్యానికి మేలు:
క్వెర్సెటిన్ అనే మూలకం గ్రీన్ యాపిల్స్‌లో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపదయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా గ్రీన్ యాపిల్స్ తీసుకోవాలి.
ఎముకల దృఢం:
మనం మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే.. ఎముకలను పటిష్టం చేసుకోవాలి. దీని కోసం మీరు ప్రతిరోజూ గ్రీన్ యాపిల్స్ తినాలి. 30 సంవత్సరాల తర్వాత ఎముక దృఢత్వం తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో గ్రీన్ ఆపిల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Best Recharge Plan 2023: బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 84 రోజుల పాటు 2 GB డేటా, అపరిమిత కాలింగ్!
జీర్ణక్రియ మెరుగు:
గ్రీన్ యాపిల్ జీర్ణక్రియకు చాలా మంచిదిగా పరిగణిస్తారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. గ్రీన్ యాపిల్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
కంటిచూపు మెరుగు:
గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా.. రాత్రి పూత కూడా బాగా కనిపిస్తుంది.
ఊపిరితిత్తులకు రక్షణ:
ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. శ్వాస సంబంధిత వ్యాధులు కూడా బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మీరు క్రమం తప్పకుండా గ్రీన్ యాపిల్స్ తింటే.. ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.