గురుత్వాకర్షణ శక్తి గురించి మనం చిన్నప్పుడు చదివాం. ఆపిల్ చెట్టుమీద నుంచి పడితే.. అది ఖచ్చితంగా కిందే పడుతుంది. భూమికి ఉన్న Gravitaion Force ప్రభావం అని అందరికీ తెలుసు. ఆకాశంలోకి మనం ఏదైనా పైకి ఎగరేస్తే అది వెంటనే కిందకి పడిపోతుంది. అయితే, ఆడుకుంటుండగా మనం షటిల్ కాక్ గాల్లోకి విసిరితే అది వెంటనే కింద పడిపోవడం మామూలే. కానీ అలా జరగకపోతే ఏమనుకోవాలి? అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అల్లూరి జిల్లా కూనవరం మండలం టేకులబోరు బి.సి. కాలనీ లో బుధవారం సాయంత్రం ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పిల్లలు సరదాగా ఇళ్ల మధ్యన షటిల్ ఆడుతున్నారు. అంతా బాగానే వుంది. అలా ఆడుకుంటూ ఉండగా షటిల్ కాక్ ఒక్క సారిగా గాలిలొ అలాగే ఉండిపోవడం జరిగింది.
Read Also: Pendurthy Ysrcp… Off The Record: పెందుర్తిలో పంచాయతీ.. పట్టు ఎవరిది?
సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లలు కాలక్షేపం కోసం షటిల్ ఆడుతుండగా ఈ వింత సంఘటన చోటు చేసుకుంది..సుమారు అరగంట సేపు తర్వాత కూడా కాక్ గాలిలోనే ఉండటంతో షటిల్ బ్యాట్ విసిరి ఆ కాక్ ని కింద పడేసినట్లుగా అక్కడి పిల్లలు చెబుతున్నారు. ఏ ఆధారం లేకుండా గాలిలో ఆగిపోవడాన్ని చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యానికి గురౌతున్నారు.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోని మీరు కూడా చూసెయ్యండి మరి..
Read Also: Mahesh Babu: భార్య పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసిన మహేష్.. ఎక్కడంటే..?